కోర్టు ఆవరణలో పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది.
కోర్టు ఆవరణలో పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ఈ ఘటన నెల్లూరు జిల్లా కేంద్రంలోని కోర్టుల సముదాయం వద్ద జరిగింది. కోర్టు ప్రహరీ సమీపంలో ఉన్న చెత్తకుండీలో కుక్కర్ బాంబు పేలింది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించడంతో అందరూ పరుగులు తీశారు. పేలుడు ధాటికి కోర్టు అద్దాలు కూడా పగిలాయి. అయితే అప్పటికే భోజన విరామ సమయం కావడం, న్యాయవాదులు అంతా బయటకు రావడంతో ఎవరికీ ఎలాంటి గాయాలు తగలలేదు.
క్యాంటీన్‌కు సమీపంలో ఈ పేలుడు సంభవించింది. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ సముదాయంలో ఐదు కోర్టులు ఉంటాయి. వీటిలో ఏదో ఒక కోర్టుకు తీసుకొచ్చే నిందితులను తప్పించడానికి ఇలాంటి ప్రయత్నం జరిగిందా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. అయితే బాంబు పేలిన ప్రదేశం కోర్టుకు చాలా దూరంలో ఉండటం, బయట ఒక చెత్తకుండీలో పెట్టడంతో అసలు దీని టార్గెట్ ఏమై ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.