స్కూటీలో అనుకోని అతిథి

Cobra Snake in Scooty Karnataka - Sakshi

వాహనంలో దూరిన నాగుపాము  

తీయడానికి నానా పాట్లు  

కృష్ణరాజపురం (బెంగళూరు): స్కూటీలో అనుకోని అతిథి మకాం వేసింది. దీంతో బెంబేలెత్తిన యజమాని జనం సహకారంతో దానిని తొలగించుకోవడానికి నానా పాట్లు పడ్డాడు. బెంగళూరు సమీపంలో హొసకోటె పట్టణంలోని వీవీ లేఔట్‌లో ఈ విడ్డూరం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఓ వ్యక్తి సోమవారం వీవీ లేఅవుట్‌లో తెలిసిన వ్యక్తుల ఇంటికి స్కూటీపై వచ్చాడు. కొద్దిసేపటి తరువాత ఇంటికి వెళ్లడానికి స్కూటీపై కూర్చుని స్టార్ట్‌ చేయబోతుంటే దాని లోపల దాక్కున్న చిన్న నాగుపాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. పామును చూసిన ఆ వ్యక్తి ఉలిక్కిపడి పరుగందుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మెకానిక్‌ సహాయంతో వాహన భాగాలు ఊడదీశారు. స్థానికంగా పాములు పట్టే నిపుణుడు పామును బయటకు తీసి పట్టణ శివార్లలో పొదల్లో సురక్షితంగా వదిలేశారు. అది చిన్నపామే అయినా కాటేసి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదన్నారు.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top