తాగి డ్రైవింగ్ చేసి బాటసారిని గాయపరిచిన కేసులో ప్రముఖ బాలీవుడ్ కోరియోగ్రాఫర్ గీతా కపూర్‌ను వర్సోవా పోలీసులు అరెస్టు చేశారు.
సాక్షి, ముంబై: తాగి డ్రైవింగ్ చే సి బాటసారిని గాయపరిచిన కేసులో ప్రముఖ బాలీవుడ్ కోరియోగ్రాఫర్ గీతా కపూర్‌ను వర్సోవా పోలీసులు అరెస్టు చేశారు. అయితే అరెస్టయిన కొన్ని గంటల తర్వాత బెయిల్ మీద విడుదల ఆమెను చేశారు. వివరాల్లోకెళితే.. స్థానిక జేపీ రోడ్‌లో ఉన్న మెడికల్ స్టోర్ వద్ద నిలబడి ఉన్న మహమ్మద్ అనే వ్యక్తిని గీతా కపూర్ కారు ఢీకొంది.
గీతా తన స్నేహితురాలిని యారి రోడ్‌లో దిగబెట్టి లోఖండ్‌వాలాలోని నివాసానికి వెళ్తున్నపుడు ఈ ఘటన జరిగిందని వర్సోవా సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఒకరు తెలిపారు. ఎదురుగా ద్విచక్ర వాహనం అడ్డు రావడంతోనే మహమ్మద్‌ను ఢీ కొన్నట్లు కపూర్ తెలిపారు. బాధితుడి ని అంధేరీలోని కోకిలాబెన్ ధీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చేర్పించినట్లు పోలీసులు తెలిపారు. పరిస్థితి నిలకడగానే ఉందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపినట్లు వారు తెలిపారు.