ఘనంగా బాలల దినోత్సవం | Children's Day Celebration Events in mumbai | Sakshi
Sakshi News home page

ఘనంగా బాలల దినోత్సవం

Nov 15 2013 1:14 AM | Updated on Sep 2 2017 12:36 AM

ముంబైతోపాటు పుణే, వివిధ ప్రాంతాల్లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహిం చారు.

సాక్షి, ముంబై: ముంబైతోపాటు పుణే, వివిధ ప్రాంతాల్లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా ముంబైలోని పలు తెలుగు సంఘాలు వివిధ కార్యక్రమాలు చేపట్టాయి. చిన్నారులకు, చాక్లెట్లు, మిఠాయిలు పంచాయి. వివిధ పోటీలను నిర్వహించి అందులో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశాయి.
 
 వర్లి పద్మశాలి మండలి ఆధ్వర్యంలో...
 బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మున్సిపల్ ఉన్నత ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు గులాబీ పువ్వులు, చాక్లెట్లు అందజేశారు. ఈ సందర్భంగా నెహ్రూ సూక్తులను అధ్యక్షుడు వాసాల శ్రీహరి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, ధర్మకర్త గంగరాజం, సంయుక్త కార్యదర్శి జిందం భాస్కర్, ఎక్కల్‌దేవి గణేష్, సురేష్ సురుకుట్ల, దుడుక అనురాధ, పాపన్ శారద తదితరులు పాల్గొన్నారు.
 
 శ్రీ పద్మశాలి తెలుగు సంఘం ఆధ్వర్యంలో..
 కామ్రాజ్‌నగర్‌లో ఉన్న ఈ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. బాలలకు తినుభండారాలను పంపిణీ చేసినట్లు సంఘం అధ్యక్షుడు కుడిక్యాల బాలకిషన్ తెలిపారు. కార్యక్రమంలో విద్యాకమిటీ చైర్మన్ మామిడాల శ్రీకాంత్, దుస్స శ్రీనివాస్, పారెల్లి రాజమహేంద్ర, అనుమల్ల వెంకట్ తదితర కార్యసభ్యులు పాల్గొన్నారు.
 
 పుణేలో..
 పింప్రి, న్యూస్‌లైన్: దేహూరోడ్‌లో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సుభాష్ చౌక్ వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మందుగా విద్యార్థులు చాచా నెహ్రూ చిత్రపటానికి పూల మాలలు వేశారు. తర్వాత పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు హాజీమలంగ్ విద్యార్థులకు నెహ్రూ గురించి తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు వెంకటేష్ కోలి (తెలుగు), ప్రధాన కార్యదర్శి సందీప్ జాదవ్, మావల్ అల్పసంఖ్యాక కాంగ్రెస్ సెల్ అధ్యక్షుడు ఆదోని గపూర్ షేక్, మహిళా అధ్యక్షురాలు గంగూతాయి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement