తన కేబిన్‌లోకి సీఎం | Chief minister Prithviraj Chavan moves into new office | Sakshi
Sakshi News home page

తన కేబిన్‌లోకి సీఎం

Feb 21 2014 11:14 PM | Updated on Sep 5 2018 9:45 PM

సుదీర్ఘ కాలం తర్వాత ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మంత్రాయలోని ఆరో అంతస్తులోగల తన కేబిన్‌లోకి మారారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సాదాసీదాగా మారిపోయారు.

 సాక్షి, ముంబై: సుదీర్ఘ కాలం తర్వాత ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మంత్రాయలోని ఆరో అంతస్తులోగల తన కేబిన్‌లోకి మారారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సాదాసీదాగా మారిపోయారు. కేవలం గుమ్మానికి పూలదండవేశారు.  2012 జూన్ 21న మంత్రాయల భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నాలుగు, ఐదు, ఆరో అంతస్తులు పూర్తిగా కాలిబూడిదైన విషయం తెలిసిందే. దీంతో మంత్రుల కేబిన్‌లన్నీ ఇతర అంతస్తుల్లోకి మార్చారు.

అక్కడి నుంచే కార్యకలాపాలను కొనసాగించారు. ఆధునిక హంగులతో ఈ అంతస్తులన్నింటినీ కొత్తగా తీర్చిదిద్దారు. ఆరో అంతస్తులోని 21,200 చదరపుటడుగుల స్థలంలో కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. ఇందులో 40 మంది ఉన్నతాధికారులు, 100 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నతాధికారుల్లో ప్రధాన కార్యదర్శి స్థాయి మొదలుకుని ప్రధాన కార్యదర్శి, అసిస్టెంట్ కార్యదర్శి, డిప్యూటీ కార్యదర్శి, ప్రత్యేక కార్యనిర్వాహక అధికారులు, వ్యక్తిగత కార్యదర్శులు, ప్రజా సంబంధాల అధికారులున్నారు. వీరితోపాటు ఇంటర్వ్యూలు నిర్వహణ, సమావేశాలు, ఫైళ్లను భద్రపరిచేందుకు కేబిన్లు ఉన్నాయి. సందర్శకుల కోసం ప్రత్యేకంగా కేబిన్లను నిర్మించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement