మద్దూరు ఎమ్మెల్యే కుమారుడిపై చీటింగ్ కేసు | cheating case filed on mudduru mla son | Sakshi
Sakshi News home page

మద్దూరు ఎమ్మెల్యే కుమారుడిపై చీటింగ్ కేసు

Dec 4 2013 3:12 AM | Updated on Aug 21 2018 5:44 PM

భూ లావాదేవీల వ్యవహారంలో మోసగించి రూ. 9 కోట్లు స్వాహా చేశారని ఆరోపిస్తూ ఇక్కడి సంజయ్‌నగర పోలీసులు ఓ ఎమ్మెల్యే కుమారుడిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ ుండ్య జిల్లా మద్దూరు ఎమ్మెల్యే డీసీ. తమ్మణ్ణ కుమారుడు సంతోష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ... సంతోష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి.

 బెంగళూరు, న్యూస్‌లైన్:   భూ లావాదేవీల వ్యవహారంలో మోసగించి రూ. 9 కోట్లు స్వాహా చేశారని ఆరోపిస్తూ ఇక్కడి సంజయ్‌నగర పోలీసులు ఓ ఎమ్మెల్యే కుమారుడిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ ుండ్య జిల్లా మద్దూరు ఎమ్మెల్యే డీసీ. తమ్మణ్ణ కుమారుడు సంతోష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు ... సంతోష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి.

 

  అత్తిబెలె దగ్గర భూమి తీసిస్తాన ని న మ్మించి తన దగ్గర రూ. 9 కోట్లు తీసుకుని మోసం చేశాడని లక్ష్మణ్ అనే వ్యక్తి సెషన్స్ కోర్టులో కేసు దాఖలు చేశాడు. విచారణ చేసిన న్యాయస్థానం సంతోష్‌పై కేసు నమోదు చేసి నివేదిక ఇవ్వాలని సంజయ్‌నగర పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు పో లీసులు సంతోష్‌పై కేసు నమోదు చేసి అతని కు టుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. దర్యాప్తు జరుగుతోందని మంగళవారం పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement