నయవంచకుడు

నయవంచకుడు - Sakshi


చెన్నై, సాక్షి ప్రతినిధి: అందంతో అమ్మాయిలకు ఎరవేయడం, ప్రేమ పేరుతో వంచించడం, మత్తుమందిచ్చి లోబరుచుకోవడం అతని వృత్తి, ప్రవృత్తి. పాపం బట్టబయలు కావడంతో జైలుపాలయ్యాడు. సహకరించిన నేరానికి తల్లి, బంధువు కూడా కటకటాల వెనక్కు వెళ్లిపోయారు. నిందితుని భార్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరాలు ఇలా ఉన్నాయి.  దిండుగల్లు మాసిలమణిపురం శ్రీనగర్‌కు చెందినపొన్‌సిబీ (21) ప్లస్‌టూ పాసై, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో చేరాడు.


తన తల్లి నెల ఖర్చుకు పంపే రూ.50వేలతో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని ఒంటరిగా నివసిస్తున్నాడు. అయితే పొన్‌సిబీ కాలేజీకి వెళ్లకుండా మోటార్ బైక్‌లో అమ్మాయిల వెంట జులాయిగా తిరిగేవాడు. మధురై జిల్లా ఆనయూర్ ముడకత్తాన్ రోడ్డుకు చెందిన బీకాం పట్టభద్రురాలైన రెజినా (24) దిండుగల్లులోని తన అక్క ఇంటికి తరచూ వస్తూండేది. ఈ క్రమంలో నిందితుడు ప్రేమిస్తున్నానంటూ ఆ యువతి వెంటపడ్డాడు.

 

 కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని బ్లేడుతో చేయి కోసుకున్నాడు. మనసు కరిగిన రెజినా అతనిపై ప్రేమను పెంచుకుంది. కాబోయే భార్యను తల్లికి పరిచయం చేస్తానని మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. కూల్‌డ్రింక్‌లో మత్తుమందిచ్చి స్పృహకోల్పోయిన తరువాత అత్యాచారం చేసి అశ్లీల చిత్రాలను చిత్రీకరించాడు. స్పృహవచ్చిన తరువాత రెజినా నిలదీయగా పెళ్లిచేసుకుంటానని హామీ ఇచ్చాడు. తాను తీసిన ఫొటోలను స్నేహితులతో పంచుకున్నాడు. కొన్నాళ్ల తరువాత మరోసారి ఇంటికి రమ్మని పిలవడంతో ఆ యువతి నిరాకరించింది. అంతేగాక పెళ్లిచేసుకోవాలని ఒత్తిడి పెంచింది. దీంతో స్నేహితుల సమక్షంలో గత ఏడాది మే 30 వ తేదీన గుళ్లో పెళ్లి చేసుకుని కాపురం పెట్టాడు. కుమారుని పెళ్లి సంగతి తెలుసుకున్న తల్లి హేమమాలిని రెజినాను గెంటివేయాలని చెప్పింది. దీంతో ఆమెకు వేధింపులు మొదలయ్యూయి.

 

 మూడునెలల గర్భిణిపై భర్త పొన్‌సిబీ క్రికెట్ బ్యాట్‌తో దాడిచేయడంతో ఆమెకు గర్భస్రావమైంది. 17 సవర్ల బంగారు నగలు, రూ.20వేల నగదును ఆమె నుంచి లాక్కున్నారు. ప్రాణాపాయం తప్పదని గ్రహించిన రెజీనా స్థానిక పోలీసులను అశ్రయించింది. నిందితునికి రాజకీయ పలుకుబడి ఉండడంతో ఫిర్యాదు స్వీకరించలేదు. జిల్లా ఎస్పీని ఆశ్రయించడంతో ఈనెల 13వ తేదీన మహిళా పోలీసులు కేసు నమోదు చేశారు. సంగతి తెలుసుకున్న నిందితులు పరారై కరూర్ రైల్వేస్టేషన్‌లో పట్టుబడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పొన్‌సిబీతోపాటూ సహకరించిన తల్లి హేమమాలిని, రాజా అనే బంధువును అరెస్ట్ చేశారు.

 

 అమ్మకానికి అమ్మాయిల చిత్రాలు

 అరెస్టయిన నిందితుడి నుంచి సేకరించిన వివరాలు పోలీసులను విస్మయానికి గురిచేశాయి. చూడ్డానికి కొంత అందంగా కనిపించే పొన్‌సిబీ పాఠశాల, కళాశాల విద్యార్థినుల వెంటబ డి యథాప్రకారం లోబర్చుకునేవాడు. స్పృహకోల్పోయిన స్థితిలో ఉన్న అమ్మాయిలపై అత్యాచారం చేసి, వాటిని చూపి బెదిరించేవాడు. ఇలా ఇతని చేతిలో 27 మంది యువతులు బలయ్యూరు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేస్తే పరువుపోతుందని భయపడి మిన్నకుండిపోయారు. దీనిని అవకాశంగా తీసుకున్న పొన్‌సిబీ మరింత రెచ్చిపోయాడు. నిందితుడిని పెళ్లి వరకూ తీసుకొచ్చిన రెజినా ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని బండారం బట్టబయలైంది.  

 

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top