మంటల్లో చిక్కుకున్న కారు | car catches fire in bhuvanagiri | Sakshi
Sakshi News home page

మంటల్లో చిక్కుకున్న కారు

Apr 15 2017 11:53 AM | Updated on Aug 14 2018 3:24 PM

వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వాహనాన్ని వదిలి బయటకు దూకేశాడు.

భువనగిరి: వేగంగా వెళ్తున్న కారులో మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్‌ వాహనాన్ని వదిలి బయటకు దూకేశాడు. ఈ ప్రమాదంలో సాంట్రో కారు పూర్తిగా కాలిబూడిదైంది. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి శివారులోని నల్లగొండ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి యత్నించే లోపే కారు పూర్తిగా కాలిపోయింది. 

Advertisement
 
Advertisement
Advertisement