స్వర్గసుఖాలను చూపిస్తానని నిలువుదోపిడీ.. | call girl hulchul in bangalore | Sakshi
Sakshi News home page

స్వర్గసుఖాలను చూపిస్తానని నిలువుదోపిడీ..

Apr 30 2016 2:51 PM | Updated on Sep 3 2017 11:07 PM

స్వర్గసుఖాలను చూపిస్తానని నిలువుదోపిడీ..

స్వర్గసుఖాలను చూపిస్తానని నిలువుదోపిడీ..

హైదరాబాద్‌కు చెందిన ‘కాల్‌గర్ల్’ బెంగళూరులో తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడుని బురిడీ కొట్టించింది.

బెంగళూరు: హైదరాబాద్‌కు చెందిన ఓ ‘కాల్‌గర్ల్’ బెంగళూరులో తమిళనాడుకు చెందిన పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడిని బురిడీ కొట్టించింది. స్వర్గసుఖాలను చూపిస్తానని చెప్పి అతన్ని నిలువుదోపిడీ చేసింది. బాధితుడి స్నేహితుడి నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సదరు నాయకుడితో పాటు అతని స్నేహితుడు కూడా పోలీసులకు అందుబాటులో లేక పోవడం గమనార్హం.
 
వివరాలు...తమిళనాడుకు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడొకరు  వ్యాపార సంబంధ పనుల పై ఈనెల 25న బెంగళూరుకు వచ్చారు. చామరాజనగర్‌కు చెందిన రిత్విక్ శెట్టి సదరు నాయకుడికి బెంగళూరు ఓల్డ్ ఎయిర్‌పోర్ట్‌రోడ్‌లో ఉన్న ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో రాజా పేరుతో రూమ్ బుక్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కాస్ట్లీ కాల్‌గర్ల్‌ను కూడా విమానంలో రప్పించి ఆయన చెంతకు చేర్చారు. సదరు కాల్‌గర్ల్ తన దగ్గరకు వెచ్చిన వెంటనే ‘తమిళనాడు నాయకుడు’ హోటల్‌లోని తన రూంకు తీసుకువెళ్లారు.
 
 కొద్ది సేపటి తర్వాత  మద్యం తీసుకురావడానికి సదరు నాయకుడు హోటల్ రూమ్ నుంచి బయటికి వచ్చారు. ఇరవై నిమిషాల తర్వాత మద్యం తీసుకుని రూమ్‌కు వెళితే అక్కడ హైదరాబాద్‌కు చెందిన కాల్‌గర్ల్‌తో పాటు టేబుల్ పై ఉంచిన బంగారు గొలుసు, నగదు, ఐపాడ్ కనిపించలేదు. పరిస్థితిని తన స్నేహితుడైన రిత్విక్‌శెట్టికి ఫోన్‌లో చెప్పి స్వస్థలానికి వెళ్లిపోయారు. దీంతో రిత్విక్‌శెట్టి స్థానిక జీవన్ బీమా నగర్ పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రిత్విక్ ఫోన్‌లో ఉన్న నంబర్లను అనుసరించి సదరు కాల్‌గర్ల్ హైదరాబాద్‌కు చెందిన యువతిగా గుర్తించారు.
 
 ఆ యువతి పై ఇప్పటికే ఇలాంటి మూడు కేసులు హైదరాబాద్‌లోని వివిధ పోలీస్‌స్టేషన్లలో నమోదైనట్లు తెలుసుకున్నారు. అంతేకాకుండా హోటల్‌లోని వీడియో ఫుటేజీలను అనుసరించి సదరు యువతి బెంగళూరులో సదరు నాయకుడితోపాటు అతని రూమ్‌లోకి వెళ్లినట్లు నిర్థారణకు వచ్చారు. మరింత సమాచారం కోసం రిత్విక్‌కు, సదరు నాయకుడికి  ఫోన్ చేస్తుంటే స్విచ్‌ఆఫ్ అని సమాధానం వస్తున్నట్లు కేసు దర్యాప్తు చేస్తున్న అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement