ప్రియురాలిపై స్నేహితులతో కలిసి అత్యాచారం | Boyfriend rapes woman with friends, held | Sakshi
Sakshi News home page

ప్రియురాలిపై స్నేహితులతో కలిసి అత్యాచారం

Feb 14 2015 11:09 PM | Updated on Sep 2 2017 9:19 PM

ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి.. మిత్రులతో కలసి అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు.

న్యూఢిల్లీ: ప్రేమ పేరుతో నమ్మించి మోసం చేసి.. మిత్రులతో కలసి  అత్యాచారానికి పాల్పడ్డాడో ప్రబుద్ధుడు. ఈ ఘటన వసంత్‌కుంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. ఓ ప్రయివేటు సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేసే అమిత్, బాధితురాలు రంగాపురి పహారి మురికివాడలో నివసిస్తున్నారు. వీరిద్దరి మధ్య స్నేహం చిగురించి గత ఏడాది ప్రేమగా మారింది.
 
 శనివారం వాలెంటైన్స్‌డే కావడంతో తన గదిలో సెలబ్రేట్ చేసుకుందామని యువతిని శుక్రవారం అమిత్ తీసుకెళ్లాడు. గదిలోకి వెళ్లిన తర్వాత ఆమెకు కూల్‌డ్రింకులో నిద్రమాత్రలు కలిపి ఇచ్చాడు. దానిని తాగిన తర్వాత స్పృహ కోల్పోవడంతో ఆమెపై స్నేహితులతో కలసి అత్యాచారం చేశాడు. కాగా, అమిత్‌ను పోలీసులు అరెస్టు చేయగా, మిగిలిన ఇద్దరూ పరారీలో ఉన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement