​మోదీ ఫాలో అవుతున్న యువకుడు ఎవరో తెలుసా? | Boy tweets sister's marriage card with Swachh Bharat logo to Narendra Modi, here's what PM did | Sakshi
Sakshi News home page

మోదీ ఫాలోఅవుతున్న యువకుడు ఎవరో తెలుసా?

Apr 3 2017 6:30 PM | Updated on Nov 6 2018 4:10 PM

​మోదీ ఫాలో అవుతున్న యువకుడు ఎవరో తెలుసా? - Sakshi

​మోదీ ఫాలో అవుతున్న యువకుడు ఎవరో తెలుసా?

ప్రధాని చేపట్టిన స్వచ్ఛ్‌భారత్‌ పథకం అంటే ప్రాణం పెట్టే తండ్రి కోరిక తీర్చేందుకు ఈ యువకుడు తన సోదరి వివాహ ఆహ్వాన పత్రికలపై స్వచ్చ్‌ భారత్‌ లోగోను ముద్రించాడు

 బెంగళూరు: ఒక వైపు చెల్లిపెళ్లి..  మరోవైపు  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి వచ్చిన అనూహ్య స్పందన దీంతో ఓ బెంగళూరు యువకుడు సంతోషంలో మునిగి తెలుతున్నాడు. ప్రధాని  చేపట్టిన   స్వచ్ఛ్‌భారత్‌ పథకం  అంటే ప్రాణం పెట్టే   తండ్రి కోరిక తీర్చేందుకు  ఈ యువకుడు తన  సోదరి వివాహ ఆహ్వాన పత్రికలపై స్వచ్చ్‌ భారత్‌ లోగోను ముద్రించాడు. అంతేకాదు  స్వచ్ఛ భారత్ సింబల్ ముద్రించిన  ఈ వెడ్డింగ్‌ కార్డును  మోదీకి ట్విట్టర్‌ ద్వారా షేర్‌ చేశారు.  అంతే ఆశ్చర్య పోవడం ఆ యువకుడి వంతైంది.

వివరాల్లోకి వెళితే  కర్నాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఆకాష్ జైన్ తన సోదరి పెళ్ళి కోసం శుభలేఖలు ముద్రించారు.  తండ్రి సూచన మేరకు సోదరి పెళ్ళి కార్డులపై స్వచ్ఛ భారత్ లోగో కూడా ముద్రించారు. దీంతోపాటు  ఉత్సాహంగా ఆ పెళ్ళి శుభలేఖను  మోదీకి పంపించాడు. అంతే  ప్రధాని నుంచి ఊహించని విధంగా వచ్చిన స్పందన వచ్చింది.  ఆకాష్, ఏప్రిల్ 1న  ప్రధాని మోదీకి ట్వీట్ చేయగా,  ఆకాష్ ట్వీట్‌ను మోదీ రీట్వీట్ చేయడంతోపాటు ట్విట్టర్‌లో ఆయన్ను ఫాలో అవడం విశేషంగా నిలిచింది.  దీంతో  ఉబ్బితబ్బిబ్బయిన  ఆకాష్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.  దీంతోపాటుగా  ఆకాష్‌ పేరు సోషల్‌ మీడియాలో   మారుమోగుతోంది. ఫాలోయింగ్‌ కూడా అదే రేంజ్‌ లో ఊపందుకుంటోంది. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement