breaking news
Swachh Bharat logo
-
కొత్త రంగుల్లో రూ.20 నోటు
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కొత్తగా ఆకుపచ్చ రంగులో రూ. 20 కరెన్సీ నోటును చలామణిలోకి తీసుకురానుంది. ఈ కొత్త రూ.20 నోట్‌పై రిజర్వుబ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సంతకం ఉంటుంది. ఈ నోటుపై కొత్త డిజైన్లు, అందులో కలిసేలా రేఖాగణిత నమూనాలు ఉంటాయి. గతంలోలాగే గాంధీజీ సిరీస్‌లోనే ఈ కొత్త నోట్ కూడా ఉంటుంది. కొత్త 20 రూపాయల నోటు వెనుకవైపు మన చారిత్రక వారసత్వ సంపదైన ఎల్లోరా గుహల చిహ్నం ఉంటుంది. నోటుకు, వెనుకవైపు స్వచ్ఛభారత్ లోగో, నినాదం ఉంటాయి. ఎల్లోరా గుహల చిత్రం, దేవనాగరి లిపిలో 20 అంకె ఉంటుంది. కొత్త నోట్‌తోపాటు పాత నోట్లూ చలామణిలోనే ఉంటాయని ఆర్బీఐ తెలిపింది. -
మోదీ ఫాలో అవుతున్న యువకుడు ఎవరో తెలుసా?
బెంగళూరు: ఒక వైపు చెల్లిపెళ్లి.. మరోవైపు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి వచ్చిన అనూహ్య స్పందన దీంతో ఓ బెంగళూరు యువకుడు సంతోషంలో మునిగి తెలుతున్నాడు. ప్రధాని చేపట్టిన స్వచ్ఛ్భారత్ పథకం అంటే ప్రాణం పెట్టే తండ్రి కోరిక తీర్చేందుకు ఈ యువకుడు తన సోదరి వివాహ ఆహ్వాన పత్రికలపై స్వచ్చ్ భారత్ లోగోను ముద్రించాడు. అంతేకాదు స్వచ్ఛ భారత్ సింబల్ ముద్రించిన ఈ వెడ్డింగ్ కార్డును మోదీకి ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అంతే ఆశ్చర్య పోవడం ఆ యువకుడి వంతైంది. వివరాల్లోకి వెళితే కర్నాటక రాజధాని బెంగళూరుకు చెందిన ఆకాష్ జైన్ తన సోదరి పెళ్ళి కోసం శుభలేఖలు ముద్రించారు. తండ్రి సూచన మేరకు సోదరి పెళ్ళి కార్డులపై స్వచ్ఛ భారత్ లోగో కూడా ముద్రించారు. దీంతోపాటు ఉత్సాహంగా ఆ పెళ్ళి శుభలేఖను మోదీకి పంపించాడు. అంతే ప్రధాని నుంచి ఊహించని విధంగా వచ్చిన స్పందన వచ్చింది. ఆకాష్, ఏప్రిల్ 1న ప్రధాని మోదీకి ట్వీట్ చేయగా, ఆకాష్ ట్వీట్‌ను మోదీ రీట్వీట్ చేయడంతోపాటు ట్విట్టర్లో ఆయన్ను ఫాలో అవడం విశేషంగా నిలిచింది. దీంతో ఉబ్బితబ్బిబ్బయిన ఆకాష్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. దీంతోపాటుగా ఆకాష్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఫాలోయింగ్ కూడా అదే రేంజ్ లో ఊపందుకుంటోంది. Dear @narendramodi, My dad specifically wanted @swachhbharat logo to be there on my sister's wedding invitation, hence got it. @PMOIndia pic.twitter.com/kD28savm82 — Akash Jain (@akash207) April 1, 2017