ద్విచక్రవాహనాలతో రోడ్లపై స్టంట్ లు చేసే వారి సంఖ్య రోజురోజుకి అధికమవుతోంది. వీరు చేసే అనేక స్టంట్‌లు పలుమార్లు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. అదేవిధంగా అతి వేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేసేవారి వల్ల ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది.
సాక్షి, ముంబై: ద్విచక్రవాహనాలతో రోడ్లపై స్టంట్ లు చేసే వారి సంఖ్య రోజురోజుకి అధికమవుతోంది. వీరు చేసే అనేక స్టంట్‌లు పలుమార్లు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. అదేవిధంగా అతి వేగం, మద్యం సేవించి డ్రైవింగ్ చేసేవారి వల్ల ప్రమాదాల సంఖ్య పెరిగిపోతోంది. ఇలా జరిగిన పలు ప్రమాదాల్లో గాయాలపాలైన కొందరు ప్రాణా లు కోల్పోతున్న సంఘటనలు కోకొల్లలు. ఈ సంఘటన నేపథ్యంలో ఇలా స్టంట్‌లకు పాల్పడేవారిని అడ్డుకోవడంతోపాటు వారిపై చర్యలు తీసుకోవడం కోసం స్పెషల్ డ్రైవ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు నియమాలు ఉల్లంఘించి స్టంట్‌లకు పాల్పడేవారిపై 889 కేసులు నమోదు చేశారు.అదేవిధంగా వీరి నుంచి రూ. 1.07 లక్షల జరిమానా కూడా వసూలు చేశారు. ముఖ్యంగా అర్ధరాత్రి అనంతరం మెరైన్ డ్రైవ్, వర్లీ, బాంద్రా రెక్లమేషన్, ఖేర్‌వాడీ మొదలగు పరిసరాలలో ద్విచక్రవాహనాల చోదకులు (బైకర్స్) ఎక్కువగా స్టంట్‌లకు పాల్పడుతున్నట్టు ఆర్‌టిఓ అధికారులు చెబుతున్నారు.
ఒక్క ఆగస్టు 15వ తేదీన నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 5008 మంది స్టంటర్లపై చర్యలు తీసుకున్నారు. వీరి నుంచి జరిమానా కూడా వసూలు చేశారు. అదే విధంగా ఆగస్టు నాలుగవ తేదీన కూడా వివిధ అభియోగాల కింద 2190 మందిపై చర్యలు తీసుకుని జరిమానా వసూలు చేసినట్టు ఆర్‌టిఓ అధికారులు తెలిపారు. ముఖ్యంగా బాంద్రా పోలీసులు ఇద్దరిని అరెస్టు కూడా చేశారు. గతంలో మోటార్ చట్టం ప్రకారం బైక్ స్టంటర్లను పట్టుకుని రూ. 100 జరి మానా విధించేవారు. ప్రస్తుతం ఐపీసీ 279 చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడం ప్రారంభించా రు. దీంతో నియమాలను ఉల్లంఘించి డ్రైవ్ చేసేవారిపై కొంత మేర ప్రభావం పడింది.