అర్ధరాత్రి నడిరోడ్డుపై ఓ ఆటాడుకుంది | Bengaluru woman describes how she fought back her molester | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి నడిరోడ్డుపై ఓ ఆటాడుకుంది

Jan 5 2017 4:51 PM | Updated on Oct 17 2018 4:29 PM

అర్ధరాత్రి నడిరోడ్డుపై ఓ ఆటాడుకుంది - Sakshi

అర్ధరాత్రి నడిరోడ్డుపై ఓ ఆటాడుకుంది

బెంగళూరులో ఒంటరి వెళ్తున్న ఓ యువతి తనను వేధించేందుకు వచ్చిన యువకుడికి తగిన బుద్దిచెప్పింది.

బెంగళూరు: న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా డిసెంబర్‌ 31వ తేదీ రాత్రి బెంగళూరులో ఆకతాయిలు ఎంతో మంది మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, వేధించగా.. ఒంటరి వెళ్తున్న ఓ యువతి తనను వేధించేందుకు వచ్చిన యువకుడిని ధైర్యంగా ఎదిరించి తగిన బుద్దిచెప్పింది. ఆమె ఆకతాయిని పట్టుకుని పిడిగుద్దులు కురిపించి, నాలుగు తన్నింది. ఈ దెబ్బకు అతగాడు పారిపోయాడు. చైతలీ వాస్నిక్‌ అనే యువతి తనకు ఎదురైన ఈ అనుభవాన్ని వివరిస్తూ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

డిసెంబర్‌ 31న అర్ధరాత్రి విధులు ముగించుకుని చైతలీ ఇంటికి నడుచుకుని వెళ్తోంది. రోడ్డుపై పోలీసులు ఉండటంతో ఆమె భయపడలేదు. కాస్త దూరం వెళ్లాక ఓ యువకుడు ఆమెకు దగ్గరగా వచ్చి, అసభ్యంగా తాకాడు. ఆమె ఒంటరిగా ఉన్నందున భయంతో ఏ మాట్లాడదని ఆకతాయి అనుచితంగా ప్రవర్తించాడు. అయితే చైతలీ వెంటనే అతణ్ని పట్టుకుని పిడుగుద్దులు కురిపించింది. కాలితో ఎడాపెడా తన్నింది. ఈ దెబ్బకు ఆకతాయి హడలిపోయాడు. ఇంతలో అక్కడికి కొంతమంది వచ్చి విడిపించేందుకు ప్రయత్నించారు. తాను ఏ తప్పూ చేయలేదని ఆకతాయి బుకాయించాడు. ఆమె మరింత కోపంతో అతన్ని చితకబాదింది. పోలీసులు వచ్చేలోగా అతను అక్కడి నుంచి పారిపోయాడు. చైతలీ ధైర్యాన్ని ప్రశంసిస్తూ నెటిజన్లు కామెంట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement