ఉద్యోగాల ఎరచూపి యువతులను.. | banglore sex racket busted: 5 arrested from parlour in indiranagar | Sakshi
Sakshi News home page

ఉద్యోగాల ఎరచూపి యువతులను..

Aug 12 2016 4:52 PM | Updated on Jul 23 2018 8:49 PM

ఉద్యోగాల ఎరచూపి యువతులను.. - Sakshi

ఉద్యోగాల ఎరచూపి యువతులను..

మసాజ్‌పార్లర్‌ ముసుగులో హైటెక్‌ వేశ్యావాటిక నిర్వహిస్తున్న కేంద్రంపై ఇందిరానగర పోలీసులు దాడిచేసి ఓ మహిళతో సహా ఐదుగురిని అరెస్ట్‌ చేశారు.

బెంగళూరు(బనశంకరి): మసాజ్‌పార్లర్‌ ముసుగులో హైటెక్‌ వేశ్యావాటిక నిర్వహిస్తున్న కేంద్రంపై ఇందిరానగర పోలీసులు దాడిచేసి ఓ మహిళతో సహా ఐదుగురిని అరెస్ట్‌ చేశారు. ఇందిరానగరలోని ఆరోమా స్టాఅండ్‌ సెలూన్‌ మసాజ్‌పార్లర్‌లో బాడీ టుబాడీ మసాజ్, హ్యాపీ ఎండింగ్, స్యాండ్‌విచ్‌ పేరుతో  వేశ్యావాటిక నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు.   

జాసియా, చిత్రదుర్గకు చెందిన మహేశ్వరప్ప, హిమాయత్‌ ఉల్లా, రాణేశ్‌రాయ్, తమిళనాడుకు చెందిన వైదేశ్వరన్‌ను అరెస్ట్‌ చేశారు. వీరి వద్ద నుంచి 9 సెల్‌ఫోన్లు, రూ.20 వేల 250 నగదు స్వాధీనం చేసుకున్నారు. వేశ్యావాటికలో చిక్కుకున్న పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నలుగురు యువతులను కాపాడారు. మసాజ్‌ పార్లర్‌ యజమాని మునీంద్రకుమార్‌ ఉద్యోగాల ఎరచూపి యువతులను రప్పించి వేశ్యావాటిక  నిర్వహిస్తున్నట్లు విచారణలో వెలుగుచూసినట్లు పోలీసులు తెలిపారు. మునీంద్రకుమార్, సింగారవేలు, రవిలు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement