
పోలీసుల అదుపులో నిందితులు
పాండిచ్చేరి తిరుభువనం సమీపంలో కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో చొరబడి హత్యకు యత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇద్దరి అరెస్ట్
కేకే.నగర్ : పాండిచ్చేరి తిరుభువనం సమీపంలో కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో చొరబడి హత్యకు యత్నించిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుభువనం సమీపంలో కుచ్చిపాలయంకు చెందిన ముత్తువేల్ (40) తిరుభువనై డివిజన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. సోమవారం ముత్తువేల్ ఇంట్లో ఉన్న సమయంలో ఇద్దరు యువకులు అతని ఇంట్లోకి చొరబడి హత్య చేయడానికి యత్నించారు. వారి నుంచి ముత్తువేల్ పారిపోవడానికి యత్నించగా అతడిని వారు వెంబడించారు.
వారిని అడ్డుకోవడానికి సోదరి కుమారుడు సంతోష్‌ను ఆ యువకులు కత్తులతో దాడి చేసి పారిపోయారు. సమాచారం అందుకుని తిరుభువనై పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. విషయం తెలిసి ముత్తువేల్ బంధువులు ఆందోళనకు దిగారు. తిరుభువనై పోలీసులు విచారణ జరిపారు. కదిరవన్ (23), కృపాకరన్ (23) అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని జరిపిన విచారణలో ముత్తుపై హత్యాయత్నం చేసింది తామేనని నేరం అంగీకరించడంతో వారిద్దరిని అరెస్ట్ చేశారు.