బిగ్‌బాస్ నటుడు అర్మాన్‌కు బెయిల్ | Armaan Kohli returns to Bigg Boss house after getting bail | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్ నటుడు అర్మాన్‌కు బెయిల్

Dec 18 2013 12:03 AM | Updated on Sep 2 2017 1:42 AM

బిగ్‌బాస్ నటుడు అర్మాన్ కోహ్లికి మంగళవారం బెయిల్ లభించింది.

 పింప్రి, న్యూస్‌లైన్: బిగ్‌బాస్ నటుడు అర్మాన్ కోహ్లికి మంగళవారం బెయిల్ లభించింది. బిగ్‌బాస్ రియాల్టీ షోలో నటిస్తున్న సమయంలో తనను కర్రతో కొట్టాడని, అసభ్యపదజాలంతో దూషించాడని  సహనటి సోఫియా ఈ నెల 12న ఫిర్యాదుచేసిన నేపథ్యంలో అర్మాన్‌ను సోమవారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా మంగళవారం ఉదయం అతడికి రూ.50 వేల నగదును జమానత్ కింద వసూలుచేసి బెయిల్ మంజూరు చేశారు. ఈ విషయమై కోహ్లి తండ్రి రాజ్‌కుమార్ మాట్లాడుతూ పబ్లిసిటీ కోసమే అర్మాన్‌పై సోఫియా ఆరోపణలు చేసిందని ఆరోపించారు. కాగా ప్రమోటర్ సల్మాన్‌ఖాన్ స్పందిస్తూ ఇదంతా షోలో భాగమై ఉంటుందని అభిప్రాయపడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement