చెన్నై, సాక్షి ప్రతినిధి: తమిళనాడు వాసులకు ట్రాఫిక్ రామస్వామి సుపరిచితమే. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా వెలిసే బోర్డులు, ఫ్లెక్సీలు తదితర ప్రచార సాధనలను తొలగిం చడం ద్వారా రాష్ట్రంలో ఆయన బహుళ ప్రాచుర్యం పొందారు. అమ్మ ఫ్లెక్సీలను సైతం నిర్దాక్షణంగా తొలగించిన నేపథ్యంలో ఇటీవల ఆయనను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. కోర్టు సైతం రామస్వామికి అనుకూలంగా వ్యాఖ్యానించడమేగాక పోలీసుశాఖపై అక్షింతలు వేసింది. బెయిల్‌పై బయటకు వచ్చిన రామస్వామి వచ్చీరాగానే మళ్లీ రోడ్లపైకి చేరుకుని ఫ్లెక్సీల తొలగింపులో నిమగ్నమయ్యారు.
రాజకీయాలకు అతీతంగా ఆయన చేసే సామాజిక సేవకు ప్రజల నుంచి మద్దతు లభిస్తున్నందున పోలీసులు పలుమార్లు ఇరుకున పడుతున్నారు. ఈ రకంగా 82 ఏళ్ల వృద్ధుడైన రామస్వామి ప్రజలకు సుపరిచితుడుగా మెలుగుతున్నారు.
విపక్షాల సభ్యుడిని నేనే: రామస్వామి
ఆర్కేనగర్ నుంచి పోటీచేసేందుకు విపక్షాలన్నీ వెనకడుగు వేస్తున్న తరుణంలో వారందరి ఉమ్మడి అభ్యర్థిగా తాను రంగంలోకి దిగుతున్నట్లు మక్కల్ పాదుగాప్పు కళగం అధ్యక్షులు, సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి గురువారం ప్రకటించారు. టీఎన్‌సీసీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్, డీఎంకే అధినేత కరుణానిధి, డీఎండీకే అధ్యక్షులు విజయకాంత్, పీఎంకే అగ్రనేత డాక్టర్ రాందాస్, ఎండీఎంకే అధినేత వైగో తదితరులను కలిసి మద్దతు కోరనున్నట్లు ఆయన చెప్పారు. జయకు జైలు శిక్షతో ఖాళీ అయిన తిరుచ్చిరాపల్లి జిల్లా శ్రీరంగం నియోజకవర్గంలో ఈఏడాది ఫిబ్రవరి 13వ తేదీన జరిగిన ఉప ఎన్నికలలో సైతం రామస్వామి పోటీ చేశారు. ఆ ఎన్నికలో 1167 ఓట్లు సాధించి ఓటమిపాలయ్యారు.
3న కాంగ్రెస్, సీపీఎంల సమావేశం:
ఆర్కేనగర్‌లో పోటీపై నిర్ణయం తీసుకునేందుకు వచ్చేనెల 3వ తేదీన టీఎన్‌సీసీ సమావేశం అవుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ ముకుల్ వాస్నిక్ ఈ సమావేశంలో పాల్గొని రాష్ట నేతల సమక్షంలో నిర్ణయం తీసుకుంటారు. అలాగే సీపీఎం సైతం ఆర్కేనగర్‌లో పోటీపై 3వ తేదీన సమావేశం కానుంది. ఉప ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు డీఎంకే ఇప్పటికే ప్రకటించింది. ప్రధాన పార్టీలన్నీ పోటీకి సుముఖంగా లేని తరుణంలో అమ్మ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అందరూ ఆశించారు. అయితే ఎవరేమన్నా ట్రాఫిక్ రామస్వామి పోటీ నుండి తప్పుకునే అవకాశం లేదు. ఈ కారణంగా ఆర్కేనగర్ ఉప ఎన్నికలో జయకు ఏకైక ప్రత్యర్థిగా ట్రాఫిక్ రామస్వామి మరో గుర్తింపును దక్కించుకోనున్నారు.
ఏకగ్రీవానికి ‘ట్రాఫిక్’ అడ్డు
Published Fri, May 29 2015 3:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాకు బిడ్డలు లేరు..ప్రజల బిడ్డల కోసమే నా తపన
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్‌కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
Advertisement