వామ్మో ఎమీ...! | Amy Jackson glamour Hollywood trend says Tamanna | Sakshi
Sakshi News home page

వామ్మో ఎమీ...!

Jan 20 2015 2:29 AM | Updated on Sep 2 2017 7:55 PM

అందాల ఆరబోతలో కేక పుట్టించేందుకు ఈ తరం నాయికలు పోటీ పడుతున్నారు. కురచ దుస్తులు ధరించడంలోను, వ్యాంప్ తారల్ని మించి పోతున్నారు.

అందాల ఆరబోతలో కేక పుట్టించేందుకు ఈ తరం నాయికలు పోటీ పడుతున్నారు. కురచ దుస్తులు ధరించడంలోను, వ్యాంప్ తారల్ని మించి పోతున్నారు. నయన, తమన్న, శ్రుతి లాంటి నేటి తారలు ఐటమ్ సాంగ్స్ నర్తకీలుగా మారుతున్నారు. ఆ మధ్య నయనతార బిల్లా చిత్రంలో ఈత దుస్తుల్లో అందాలను ఆరబోసి యువత గుండెల్లో కల్లోలం రేపింది. గజిని చిత్రంలో ఓ పాటలో అందాలను ఆరబోశారు. ఆ తర్వాత గ్లామర్ విషయంలో ఆచి తూచి అడుగులు వే స్తోంది. అలాగే, తమన్న పయ్య చిత్రం, తెలుగులో రచ్చ చిత్రంలో వాన పాటలో తడిసి ముద్దై అందాలను ఆరబోసి కుర్ర కారు గుండెల్లో గుబులు పుట్టించింది.
 
 అయితే, కొంచెం గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ తమిళంలో నటించిన వీరం చిత్రంలో కాస్త సంసార పక్షంగా కనిపించింది. తాజాగా, ఆర్యతో రొమాన్స్ చేస్తున్న నూతన చిత్రంలో ఓ మోస్తారు గ్లామర్‌ను ప్రదర్శిస్తున్నట్టు తమన్న పేర్కొంది. అలాంటి తమన్నను వామ్మో అనిపించిన విషయం గురించి ఆమె చెబుతూ, ఐ చిత్రంలో నాయకీ ఎమిజాక్సన్ అందాల ఆరబోత తనను విస్మయానికి గురి చేసిందని చెప్పింది. ఆమె ధరించిన ఈత దుస్తులు, విచ్చవిలవిడిగా అందాలను ఆరబోశాయని చెప్పింది.  ఇప్పటి వరకు తానే గ్లామర్ విషయంలో శ్రుతి మించామనే అపోహలో ఉన్నామని, ఎమి జాక్సన్‌ను చూసిన తర్వాత తామే పాటి అని చెప్పింది. ఎంతైనా ఇంగ్లీషు భామ కదా...అందాల ఆరబోతలో కేక పుట్టించిందన్న అభిప్రాయాన్ని తమన్న వ్యక్తం చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement