మేమేమి చేశాం నేరం.. | Africans in midst of political storm in Delhi | Sakshi
Sakshi News home page

మేమేమి చేశాం నేరం..

Jan 17 2014 11:25 PM | Updated on Mar 28 2019 6:23 PM

నగర రాజకీయాలకు తాము బలవుతున్నామని ఢిల్లీలో నివాసముంటున్న ఆఫ్రికన్ యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

న్యూఢిల్లీ: నగర రాజకీయాలకు తాము బలవుతున్నామని ఢిల్లీలో నివాసముంటున్న ఆఫ్రికన్ యువత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో నడుస్తున్న వ్యభిచార, మాదక ద్రవ్యాల రాకెట్‌లో ఆఫ్రికన్ యువతను నిందితులుగా ఢిల్లీ మంత్రి ఆరోపించిన విషయం తెలిసిందే. ఉగాండా, నైజీరియా నుంచి చదువుకోవడానికి, వైద్య అవసరాలకు నగరం వచ్చిన పలువురు ఆఫ్రికన్లు శుక్రవారం మీడియాతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు.‘గురువారం రాత్రి మేం ఇంట్లో ఉన్నాం.. అకస్మాత్తుగా మా ఇంటి ముందు అరుపు లు విని పించాయి. వచ్చి చూస్తే అక్కడ జనసందోహం కని పించింది.  
 
 భయపడి ఇంట్లో తాళం వేసుకుని కూర్చున్నాం..’ అని ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకుంటున్న 24 ఏళ్ల సాం డ్రా చెప్పింది. వైద్యచికిత్స కోసం వచ్చిన 23 ఏళ్ల సెల్వియా మాట్లాడుతూ.. వారం తా తమను దుర్భాషలాడుతూ అవమానించారని ఆవేదన వ్యక్తం చేసింది. అనంతరం పోలీ సులు వచ్చి తమ ను బయటకు రావాలని పిలిచారన్నారు. ‘మమ్మల్ని ఆస్పత్రికి తీసుకెళ్లి కొన్ని పరీక్షలు చేశారు.. తర్వాత ఇంటికి వెళ్లేం దుకు అనుమతించారు..’ అని సాండ్రా తెలిపారు.‘వచ్చిన జనాలను చూస్తే వారు మమ్నల్ని చంపేస్తారేమోననుకున్నాం. చాలా భయపడ్డాం..’ అని అప్పటి సంఘటనను గుర్తుచేసుకుంది. వ్యభిచా రం, మాదకద్రవ్యాల వ్యాపారం జరుగుతున్నాయని తమకు ఫిర్యాదులందాయని ఆరోపిస్తూ గురువారం రాత్రి ఢిల్లీ న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి, ఆప్ కార్యకర్తలు కొందరు గురువారం రాత్రి దక్షిణ ఢిల్లీలోని ఖిర్కి ఎక్స్‌టెన్షన్ చేరుకుని హడావుడి చేసిన విషయం తెలిసిందే.  ప్రత్యక్ష్య సాక్షుల కథనం ప్రకారం.. మంత్రి భారతి, కొందరు అనుచరులతో ఒక ఇంటిని చేరుకుని లోపల ఉన్నవారిని బయటకు రావాలని డిమాండ్ చేశారు. ‘అర్ధరాత్రి వేళ నల్ల జాకెట్లు ధరించిన కొందరు వచ్చి మా ఇంటి తలుపులు కొట్టడం మొదలుపెట్టారు.
 
 మా పాస్‌పోర్టులను చూపించాలని డిమాండ్ చేశారు..   పది నిమిషాల తర్వాత పోలీసులు వచ్చి వారిని పంపించివేశారు’ అని 29 ఏళ్ల ఇరేనే తెలి పింది. పోలీసులు వచ్చిన తర్వాత మంత్రి భారతి వారి తో వాగ్వాదానికి దిగారు. అక్కడ ‘రాకెట్’ నిర్వహిస్తున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించారు. అయితే పోలీసులు దానికి నిరాకరిం చారు. వారెంట్ లేకుండా మహిళలను అరెస్టు చేయడం చట్టప్రకారం కుదరదని స్పష్టం చేశారు.  ఇదిలా ఉండగా నగరంలో డ్రగ్‌‌స రవాణా కేసుల్లో ఎక్కువ శాతం అరెస్టు అవుతోంది ఆఫ్రికన్ దేశాల వారే కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement