ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ని ద‌త్త‌త తీసుకున్న ప్ర‌ణీత | Actor Pranitha to adopt govt school in Hassan | Sakshi
Sakshi News home page

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ని ద‌త్త‌త తీసుకున్న ప్ర‌ణీత

Oct 17 2018 8:26 AM | Updated on Jul 26 2019 5:58 PM

Actor Pranitha to adopt govt school in Hassan - Sakshi

యశవంతపుర : సొంత గడ్డపై నటి ప్రణీత తన  మమకారం చాటుకున్నారు.  అక్కడ ఎలాంటి సదుపాయాలకు నోచుకొని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నారు. రూ.5 లక్షలతో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ముందుకు వచ్చారు. ప్రణీత మాట్లాడుతూ తాను పుట్టి పెరిగింది బెంగళూరు అయినప్పటికీ  తన తండ్రి పుట్టింది మాత్రం ఆలూరులోనని పేర్కొన్నారు.  సొంతూరు ఆలూరులో ఏదో ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని భావించి పాఠశాలను దతత్త తీసుకున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలో మరుగుదొడ్డి నిర్మించడంతోపాటు తరగతి గదుల రూపురేఖలను మార్చి విద్యార్థులకు సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఇది పూర్తయ్యాక మరికొన్ని పాఠశాలలను  దత్తత తీసుకొనే ఆలోచన ఉందన్నారు. అంతేగాకుండా విద్యార్థులకు నైపుణ్యాలను నేర్పించేందుకు కృషి చేస్తానన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement