కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
Jan 21 2017 10:45 AM | Updated on Jul 21 2019 4:48 PM
తిరుమల: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని శనివారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, ఆయన భార్య అమల, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత మహేష్‌రెడ్డి ఉదయం శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో మంత్రాలయం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థ స్వామిజీ, మహాత్మగాంధీ మనవడు రాజ్ మోహన్ గాంధీ దంపతులు కూడా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ప్రముఖులకు టీటీడీ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందించారు.
Advertisement
Advertisement