హీరో ధనుష్ నిర్మిస్తున్న ఇల్లు కూల్చివేత | Actor dhanush home demolished | Sakshi
Sakshi News home page

హీరో ధనుష్ నిర్మిస్తున్న ఇల్లు కూల్చివేత

Jul 30 2014 8:08 AM | Updated on Apr 3 2019 9:01 PM

హీరో ధనుష్ నిర్మిస్తున్న ఇల్లు కూల్చివేత - Sakshi

హీరో ధనుష్ నిర్మిస్తున్న ఇల్లు కూల్చివేత

కోలీవుడ్ హీరో ధనుష్ కోవై జిల్లాలో నిర్మిస్తున్న భవనాన్ని ఆ జిల్లా అధికారులు కూల్చివేశారు.

చెన్నై : కోలీవుడ్ హీరో ధనుష్ కోవై జిల్లాలో నిర్మిస్తున్న భవనాన్ని ఆ జిల్లా అధికారులు కూల్చివేశారు. ధనుష్ కొవై జిల్లా వైదేహి నీర్విళిచ్చి సమీపంలో అధునాతన వసతులతో ఒక భవనాన్ని నిర్మిస్తున్నాడు. అయితే ఆ భవనం అటవీ శాఖ పరిధిలో ఉండటం వల్ల వారి అనుమతి లేకుండా నిర్మించినట్లు ఫిర్యాదు రావటంతో కోవై జిల్లా అధికారులు భవనాన్ని కూల్చివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

 దీంతో ధనుష్ భవనం కూల్చివేతకు గురైంది. ఒక పక్క పుట్టినరోజు వేడుకలతో (మంగళవారం పుట్టినరోజు) మరోపక్క నిర్మించి, హీరోగా నటించిన చిత్రం వేలై ఇల్లా పట్టదారి విజయం సాధించిన ఆనందంలో ఉన్న ధనుష్కు ఈ సంఘటన ఆవేదన కలిగించినట్లు సమాచారం. అయితే ఈ ఘటనపై అతను స్పందించలేదు.
(ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement