తీవ్రవాది అబూబకర్ సిద్ధిక్ అదేశాల మేరకే తాము రాష్ట్రంలో విధ్వంసాలకు పాల్పడ్డామని పోలీస్ ఫక్రుద్దీన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: తీవ్రవాది అబూబకర్ సిద్ధిక్ అదేశాల మేరకే తాము రాష్ట్రంలో విధ్వంసాలకు పాల్పడ్డామని పోలీస్ ఫక్రుద్దీన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. చెన్నైలో ఫక్రుద్దీన్, చిత్తూరు జిల్లాలో పన్నా ఇస్మాయిల్, బిలాల్ మాలిక్ అనే తీవ్రవాదులు పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. వీరిలో ఫక్రుద్దీన్‌ను పోలీసులు బుధవారం విచారించారు. పోలీసులు అందించిన వివరాల మేరకు ఫక్రుద్దీన్ అల్-ఉమా తీవ్రవాద ముఠాకు సన్నిహితుడు. పోలీసులపై బాంబులు విసిరి ఇమాం ఆలీ అనే తీవ్రవాదిని విడిపించుకుని పోయిన తర్వాతనే తీవ్రవాదుల రికార్డుల్లోకెక్కాడు. దుబారుు, ఆప్ఘనిస్తాన్‌లో తీవ్రవాద శిక్షణ పొందిన అబూబకర్ సిద్ధిక్ ఆదేశాలతోనే అనేక మంది హిందూ నేతల హత్యలకు పాల్పడ్డాడు.
మదురై తిరుమగంళంలో బీజేపీ అగ్రనేత అద్వానీని హతమార్చేందుకు కుట్ర, వేలూరులో అరవిందరెడ్డి, వెల్లయప్పన్, మదురైలో బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి రమేష్, పాల వ్యాపారి సురేష్ హత్యలు సిద్ధిక్ సూచనల మేరకే అమలు చేశారు. ఇదిలా ఉండగా ముగ్గురు తీవ్రవాదులు అరెస్ట్ కాగానే చెన్నై నుంచి పరారైన సిద్ధిక్ కోసం పోలీసులు అనేక ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఆంధ్రా సరిహద్దుల్లోని అడువులను సైతం జల్లెడ పడుతున్నారు. సెల్‌ఫోన్ వినియోగించకుండా సిద్ధిక్ జాగ్రత్తలు తీసుకోవడంతో అతని ఉనికి కష్టసాధ్యమైంది. తమిళనాడుకు చేరుకునే ముందు అతను 40 మందికి తీవ్రవాద శిక్షణ ఇచ్చినట్లు సమాచారం అందింది. ఇలా శిక్షణ పొందిన వారిలో కొందరు రాష్ట్రంలో సంచరిస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.
పోలీసులకు పదోన్నతులు
తీవ్రవాదులను పట్టుకోవడంలో సాహసం చేసిన 20 మంది పోలీసులను సీఎం జయలలిత అభినందించడంతో పాటు వారికి పదోన్నతులు కల్పించారు. పుత్తూరు ఆపరేషన్‌లో తీవ్రవాదుల చేతిలో తీవ్రంగా గాయపడి పోరూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇన్‌స్పెక్టర్ లక్ష్మణన్‌ను ఆమె నేరుగా వెళ్లి పరామర్శించారు. లక్ష్మణన్‌తో పాటు మరో ఇన్‌స్పెక్టర్ సెంథిల్‌కుమార్ తదితరులు పదోన్నతులు పొందిన వారిలో ఉన్నారు.