400 మంది ఖైదీలకు క్షమాభిక్ష | 400 prisoners released on mercy in Tamilnadu state | Sakshi
Sakshi News home page

400 మంది ఖైదీలకు క్షమాభిక్ష

Jan 14 2015 9:29 AM | Updated on Sep 2 2017 7:43 PM

400 మంది ఖైదీలకు క్షమాభిక్ష

400 మంది ఖైదీలకు క్షమాభిక్ష

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల మంది ఖైదీలకు పెరోల్ లభించింది.

చెన్నై: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల మంది ఖైదీలకు పెరోల్ లభించింది. రాష్ట్రంలో ఉన్న తొమ్మిది సెంట్రల్ జైళ్లలో ఐదు వేల మందికి పైా ఖైదీలు నిర్బంధంలో ఉన్నారు. వీరిలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు తరచూ పెరోల్‌పై విడుదల చేస్తారు. ప్రస్తుతం పొంగల్ పండుగ సందర్భంగా చాలా మంది ఖైదీలు పెరోల్ కోరుతూ జైలు అధికారులకు వినతిపత్రా లు అందజేశారు. దీని ప్రకారం తొమ్మిది సెంట్రల్ జైళ్ల నుంచి సుమారు 400 ఖైదీలకు పెరోల్ అందజేసినట్లు జైలు అధికారి ఒకరు తెలిపారు.

దీని ప్రకారం సేలం సెంట్రల్ జైళ్లో 40 మంది శిక్షా ఖైదీలకు పెరోల్ లభించింది. ఒక్కొక్కరికి మూడు రోజుల నుంచి ఆరు రోజుల వరకు పెరోల్ అందజేశారు. దీని గురించి జైలు అధికారి మాట్లాడుతూ జైలులో వున్న శిక్షా ఖైదీ ప్రవర్తనను దృష్టిలో ఉంచుకుని పెరోల్ అందజేస్తామన్నారు. ఈ పెరోల్ ముగియగానే వారు జైళ్లకు చేరుకోవాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement