బాలికను గర్భవతిని చేసిన వృద్ధుడు | 13 Yr Old Girl Pregnant By62 Yr Old Man | Sakshi
Sakshi News home page

బాలికను గర్భవతిని చేసిన వృద్ధుడు

Jul 1 2014 11:55 PM | Updated on Sep 2 2017 9:39 AM

బాలికను గర్భవతిని చేసిన వృద్ధుడు

బాలికను గర్భవతిని చేసిన వృద్ధుడు

బాలికను గర్భవతిని చేసిన వృద్ధుడిని తిరువళ్లూరు తాలుకా పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా తిరువేలాంగాడు యూనియన్ పరిధిలోని వరదాపురం

 తిరువళ్లూరు:బాలికను గర్భవతిని చేసిన వృద్ధుడిని తిరువళ్లూరు తాలుకా పోలీసులు అరెస్టు చేశారు. తిరువళ్లూరు జిల్లా తిరువేలాంగాడు యూనియన్ పరిధిలోని వరదాపురం గ్రామానికి చెందిన పశువుల కాపరి రాజ్‌కుమార్(62). ఇతను పక్కింటిలో ఉంటున్న 13 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ఈ విషయం మూడు వారాల క్రితం వెలుగులోకి వచ్చినప్పటికీ గ్రామస్తులు విషయాన్ని దాచారు. ఈ  విషయం వెలుగులోకి రావడంతో రాజ్‌కుమార్ వరదాపురం నుంచి పారిపోయాడు. ఈ నేపథ్యంలో వ్యక్తిగత పనుల నిమిత్తం ఆదివారం సాయంత్రం వరదాపురం వచ్చిన రాజ్‌కుమార్‌ను గ్రామస్తులు పట్టుకుని పట్రపెరంబదూరు పంచాయతీ అధ్యక్షుడు చిన్నదురైకి అప్పగించారు.
 
 ఆయన గ్రామంలోకి వె ళ్లి  బాధిత బాలిక, వృద్ధుడి బంధువుల వద్ద విచారణ జరిపారు. విచారణలో బాలిక గర్భం దాల్చడంతో పాటు ఇందుకు రాజ్‌కుమార్ కారణమని నిర్ధారించారు. సోమవారం ఉదయం తాలుకా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సోమవారం ఉదయం రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. విచారణలో నిందితుడు రాజ్‌కుమార్ నేరం అంగీకరించడంతో మంగళవారం ఉదయం అతన్ని అరెస్టు చేసి జ్యుడిషియల్ న్యాయమూర్తి     తమిళరసి ఎదుట హాజరుపరిచి జైలుకు తరలించారు. ప్రసుత్తం ఏడు నెలల గర్భిణిగా ఉన్న ైబాలికకు ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement