ఎయిర్పోర్ట్లో 1.25 కిలోల బంగారం పట్టివేత | 1.25 KG gold seized at chennai airport | Sakshi
Sakshi News home page

ఎయిర్పోర్ట్లో 1.25 కిలోల బంగారం పట్టివేత

Aug 7 2014 10:32 AM | Updated on Sep 2 2017 11:32 AM

దోహా నుంచి నగరానికి వచ్చిన ఇస్మాయిల్ అనే ప్రయాణికుడి నుంచి భారీగా బంగారాన్ని చెన్నై విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

చెన్నై : దోహా నుంచి నగరానికి వచ్చిన ఇస్మాయిల్ అనే ప్రయాణికుడి నుంచి భారీగా బంగారాన్ని చెన్నై విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ స్వాధీనం చేసుకున్న బంగారాన్ని అధికారులు సీజ్ చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గురువారం ఉదయం దోహా నుంచి చెన్నై నగరానికి విమానం చేరుకుంది.

ప్రయాణికుల లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్మాయిల్ లగేజీలో భారీగా బంగారం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. అతడి వద్ద స్వాధీనం చేసుకున్న బంగారం 1.25 కిలోలని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement