
భారత సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ మైదానం బయట అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. గ్వాలియర్‌కు చెందిన ఐటీఎం యూనివర్సిటీ అతనికి గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది. భారత క్రికెటర్‌గా అనేక చిరస్మరణీయ విజయాల్లో భాగం కావడంతో పాటు క్యాన్సర్‌తో పోరాడి అనేక మందికి స్ఫూర్తిగా నిలవడం వల్లే యువీకి ఈ పట్టా ఇస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది.
తనకు లభించిన గౌరవం పట్ల సంతోషం వ్యక్తం చేసిన యువీ...భవిష్యత్తులోనూ తన సేవాకార్యక్రమాలు కొనసాగుతాయన్నాడు.