యువరాజ్ సెలబ్రేషన్స్ ఇలా.. | Yuvraj Singh celebrates with Hazel Keech after Sunrisers Hyderabad lift maiden IPL title | Sakshi
Sakshi News home page

యువరాజ్ సెలబ్రేషన్స్ ఇలా..

May 30 2016 5:59 PM | Updated on May 28 2018 2:10 PM

టీమ్ ఇండియా ఆల్ రౌండర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు యువరాజ్ సింగ్ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు.

బెంగళూరు: టీమ్ ఇండియా ఆల్ రౌండర్, సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు యువరాజ్ సింగ్ ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్, టీ20 ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ, అండర్-19 వరల్డ్ కప్, ఐపీఎల్ టైటిల్స్ దక్కించుకున్న టీమ్స్ లో  ఉన్న ఏకైక ఆటగాడిగా అరుదైన ఘనతను సొంతం చేసుకున్న యువీ తన ఆనందాన్ని అటు జట్టు సహచరులతో పాటు జీవిత భాగస్వామితో పంచుకున్నాడు.

 

గత ఎనిమిదేళ్ల నుంచి ఐపీఎల్లో యువరాజ్ ప్రాతినిథ్యం వహిస్తున్నా, ఏ రోజూ కూడా టైటిల్ను గెలిచిన జట్టులో లేడు. అయితే  సుదీర్ఘ విరామం అనంతరం యువరాజ్ నిరీక్షణ ఫలించింది. ఐపీఎల్ తాజా టైటిల్ను తన జట్టు సన్ రైజర్స్ గెలవడంతో యువరాజ్ కోరిక తీరింది. దీంతో అతని ఆనందానికి హద్దుల్లేవ్.  తొలుత చిన్నస్వామి స్టేడియంలో  టైటిల్ సెలబ్రేషన్స్ ను సహచరులతో కలిసి ఘనంగా పంచుకున్న యువీ.. సన్ రైజర్స్ జట్టు బస్సు బయల్దేరాక తన సంతోషాన్ని కాబోయే జీవిత భాగస్వామి హజల్ కీచ్తో పంచుకున్నాడు. ఆ బస్సులో హజల్ కీచ్ పక్కనే కూర్చున్న యువరాజ్ తన జట్టు టైటిల్ గెలిచిన క్షణాలను ఆస్వాదించాడు.

ఐపీఎల్ సీజన్లో సన్ రైజర్స్ ఆడే చాలా మ్యాచ్లకు హాజరైన హజల్ కీచ్..అటు యువరాజ్ ను, జట్టును కూడా ఉత్సాహరుస్తూ ఉండేది. దీంతో సన్ రైజర్స్ క్యాంపులో హజల్ కీచ్ కూడా ఒక సభ్యురాలిగా మారిపోయింది. గతేడాది నవంబర్ లో యువరాజ్ సింగ్-హజల్ కీచ్ల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ జంట ఎప్పుడూ పెళ్లి పీటలెక్కుతుందనేది దానిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement