యువరాజ్ కు రాజీవ్ గాంధీ ఎక్స్‌లెన్స్ అవార్డు

యువరాజ్ కు రాజీవ్ గాంధీ ఎక్స్‌లెన్స్ అవార్డు


న్యూఢిల్లీ: భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ , పాకిస్థాన్ జర్నలిస్టు రీమా అబాసీ సహా 24 మంది ఐదో రాజీవ్ గాంధీ ఎక్స్‌లెన్స్ అవార్డులకు ఎంపికయ్యారు. కేన్సర్ నివారణ ప్రచారంలో విశేష కృషి చేసినందుకుగాను యువరాజ్ స్థాపించిన ‘యువీకెన్’ అనే స్వచ్ఛందకు ఈ అవార్డు లభించింది. ‘హిస్టారిక్ టెంపుల్స్ ఇన్ పాకిస్థాన్: ఏ కాల్ టు కాన్‌సైన్స్(పాకిస్థాన్‌లో చారిత్రక దేవాలయాలు: అంతరాత్మకు పిలుపు)’ అనే గ్రంథం ద్వారా పాకిస్థాన్‌లోని దేవాలయాల ఖ్యాతిని చాటినందుకు రీమా అబాసీని ఈ అవార్డు వరించింది.


 


అలాగే ప్రపంచస్థాయిలో సెహ్వాగ్ ఇంటర్నేషనల్ స్కూలును స్థాపించినందుకు క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ భార్య ఆర్తీ సెహ్వాగ్, ఎవరెస్టును అధిరోహించిన తొలి కవలలుగా రికార్డు సృష్టించినందుకు హర్యానాకు చెందిన తషి, నుంగ్షి మాలిక్‌లు కూడా ఈ అవార్డులు గెలుపొందారు. 

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top