మెయిన్‌ ‘డ్రా’కు యూకీ బాంబ్రీ అర్హత | Yuki Bhambri sets up clash with Milos Raonic | Sakshi
Sakshi News home page

మెయిన్‌ ‘డ్రా’కు యూకీ బాంబ్రీ అర్హత

Jun 18 2018 10:03 AM | Updated on Jun 18 2018 10:03 AM

 Yuki Bhambri sets up clash with Milos Raonic - Sakshi

లండన్‌: భారత నంబర్‌వన్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ యూకీ బాంబ్రీ ఏటీపీ–500 ఫీవర్‌ ట్రీ చాంపియన్‌షిప్‌లో మెయిన్‌ ‘డ్రా’కు అర్హత సాధించాడు. లండన్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో అతను క్వాలిఫయింగ్‌ విభాగంలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచాడు.

ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ రౌండ్‌ మ్యాచ్‌లో యూకీ 6–4, 6–2తో టేలర్‌ ఫ్రిట్జ్‌ (అమెరికా)పై నెగ్గాడు. క్వాలిఫయర్‌ హోదాలో మెయిన్‌ ‘డ్రా’లో అడుగుపెట్టిన యూకీ తొలి రౌండ్‌లో ప్రపంచ 35వ ర్యాంకర్‌ మిలోస్‌ రావ్‌నిచ్‌ (కెనడా)తో ఆడతాడు.  

Advertisement
 
Advertisement
Advertisement