యూనిస్ ‘హ్యాట్రిక్’ శతకం | Younis 'hat-trick' century | Sakshi
Sakshi News home page

యూనిస్ ‘హ్యాట్రిక్’ శతకం

Oct 31 2014 1:02 AM | Updated on Sep 2 2017 3:37 PM

యూనిస్ ‘హ్యాట్రిక్’ శతకం

యూనిస్ ‘హ్యాట్రిక్’ శతకం

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ అద్భుత ఫామ్ కొనసాగుతోంది.

పాకిస్థాన్ 304/2
 
అబుదాబి: ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ అద్భుత ఫామ్ కొనసాగుతోంది. గురువారం ఆసీస్‌తో ఇక్కడ ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌లో కూడా యూనిస్ (155 బంతుల్లో 111 బ్యాటింగ్; 10 ఫోర్లు, 1 సిక్స్) శతకంతో చెలరేగాడు. వరుసగా మూడు ఇన్నింగ్స్‌లలో అతనికి ఇది మూడో సెంచరీ కావడం విశేషం. ఆస్ట్రేలియా జట్టుపై ఒక బ్యాట్స్‌మన్ ఈ ఘనత సాధించడం 89 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి.

యూనిస్‌తో పాటు అజహర్ అలీ (223 బంతుల్లో 101 బ్యాటింగ్; 6 ఫోర్లు) కూడా సెంచరీ సాధించడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది. వీరిద్దరు మూడో వికెట్‌కు అభేద్యంగా 208 పరుగులు జోడించడం విశేషం. అంతకు ముందు టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ఎంచుకుంది. హఫీజ్ (45), షెహజాద్ (35) తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించి జట్టుకు శుభారంభం అందించారు. ఆసీస్ బౌలర్లలో జాన్సన్, లియోన్ చెరో వికెట్ పడగొట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement