డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్‌కు మరోసారి భారత్ వేదికైంది.
న్యూఢిల్లీ: డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నమెంట్‌కు మరోసారి భారత్ వేదికైంది. ఐదేళ్ల తర్వాత ముంబైలో ఈ టోర్నీ జరగనుంది. 2012లో చివరిసారిగా పుణేలో డబ్ల్యూటీఏ టోర్నీ జరిగింది. దీని వల్ల ప్రపంచ టాప్–50 క్రీడాకారిణులతో తలపడే అవకాశం భారత అమ్మాయిలకు లభిస్తుంది.
మెయిన్ డ్రా, క్వాలిఫయింగ్‌లో చెరో నాలుగు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇస్తారు. చెన్నై ఓపెన్ ఏటీపీ టోర్నీ కూడా ఈ సారి మహారాష్ట్రకు తరలింది. ఇప్పుడిది ‘మహారాష్ట్ర ఓపెన్’ పేరుతో పుణేలో జరగనుంది.