ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో లక్ష్యసేన్‌   | World Junior Badminton Championships Lakshya Sen enters semis | Sakshi
Sakshi News home page

ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో లక్ష్యసేన్‌  

Nov 18 2018 2:40 AM | Updated on Nov 18 2018 2:40 AM

World Junior Badminton Championships Lakshya Sen enters semis - Sakshi

భారత యువ షట్లర్‌ లక్ష్య సేన్‌ వరల్డ్‌ జూనియర్‌ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం జరిగిన అండర్‌–19 పురుషుల సింగిల్స్‌ క్వార్టర్స్‌లో నాలుగో సీడ్‌ లక్ష్యసేన్‌ 21–8, 21–18తో ఆదిల్‌ అలీ సాదికిన్‌ (మలేసియా)పై గెలిచి సెమీస్‌కు అర్హత సాధించాడు. అండర్‌–19 పురుషుల డబుల్స్‌ క్వార్టర్స్‌లో హైదరాబాదీ జోడి శ్రీకృష్ణ సాయికుమార్‌–విష్ణువర్ధన్‌ గౌడ్‌ 11–21, 8–21తో యాంగ్‌ షిన్‌–చాన్‌ వాంగ్‌ (కొరియా) జంట చేతిలో ఓడిపోయింది. 

Advertisement
 
Advertisement
Advertisement