ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌లో వరుస పరాజయాలతో చతికిలపడ్డ భారత హాకీ జట్టు ఇప్పుడు పరువు కోసం పోరాడుతోంది.
నేడు దక్షిణ కొరియాతో భారత్ వర్గీకరణ పోరు
ప్రపంచకప్ హాకీ
మధ్యాహ్నం గం. 12.00 నుంచి
టెన్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
ది హేగ్ (నెదర్లాండ్స్): ప్రతిష్టాత్మక ప్రపంచకప్‌లో వరుస పరాజయాలతో చతికిలపడ్డ భారత హాకీ జట్టు ఇప్పుడు పరువు కోసం పోరాడుతోంది. తొమ్మిదో స్థానం కోసం నేడు జరగనున్న వర్గీకరణ మ్యాచ్‌లో దక్షిణ కొరియాతో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది.
లీగ్ దశలో నాలుగు పరాజయాలు, ఒక గెలుపుతో భారత జట్టు నిరాశపరిస్తే... దక్షిణ కొరియా పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ ఇద్దరికి కీలకంగా మారింది. మరో మూడు నెలల్లో ఆసియా గేమ్స్ కూడా జరగనున్నాయి. ఇందులో మరోసారి కొరియాతో తలపడాల్సి ఉంటుంది కాబట్టి ఈ మ్యాచ్ గెలిస్తే జట్టులో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.