సిల్లీ రనౌట్‌.. ఆసీస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌ | World Cup 2019 Marcus Stoinis Silly Run Out Against England | Sakshi
Sakshi News home page

సిల్లీ రనౌట్‌.. ఆసీస్‌ ఫ్యాన్స్‌ ఫైర్‌

Jun 25 2019 9:08 PM | Updated on Jun 25 2019 9:19 PM

World Cup 2019 Marcus Stoinis Silly Run Out Against England - Sakshi

లండన్‌: ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ స్టొయినిస్‌ రనౌట్‌ అయిన తీరుపై ఆ జట్టు ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు అవసరమైన సమయంలో అనవసరంగా రనౌటైన అతడిపై సోషల్‌మీడియా వేదికగా మండిపడుతున్నారు.  నాన్‌స్ట్రైక్‌లో ఉన్న స్టీవ్‌ స్మిత్‌ సంకేతాలను ఏమాత్రం పట్టించుకోకుండా తొందరపడ్డాడని, లేని పరుగు కోసం యత్నించి స్టొయినిస్‌ రనౌట్‌ అయ్యాడని విమర్శిస్తున్నారు. ఇక ఆ సమయంలో బ్యాటింగ్‌ చేస్తున్న స్మిత్‌తో పాటు డగౌట్‌లో ఉన్న సారథి ఆరోన్‌ ఫించ్‌ కూడా స్టొయినిస్‌ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. 

ఆసీస్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా అదిల్‌ రషీద్‌ వేసిన 42వ ఓవర్‌ ఐదో బంతిని స్టీవ్‌ స్మిత్‌ లాంగాఫ్‌ వైపు కొట్టి సింగిల్‌ తీసే ప్రయత్నం చేశాడు. అయితే మరో ఎండ్‌లో ఉన్న స్టొయినిస్‌ లేని రెండో పరుగు కోసం పరిగెత్తాడు. కానీ స్మిత్‌ రెండో పరుగు కోసం అనాసక్తిగా ఉండటంతో క్రీజుకు దగ్గర్లోనే ఆగిపోయాడు. అయితే పరుగు పందెంలో పాల్గొన్న ఆటగాడిగా పరిగెత్తుకుంటూ రెండో ఎండ్‌కు చేరుకున్నాడు. అప్పటికే బెయిర్‌ స్టో బంతిని అందుకొని కీపర్‌ బట్లర్‌కు అందించడంతో స్టొయినిస్‌ పెవిలియన్‌ బాట పడ్డాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement