మహిళా టీ-20 : బంగ్లా విజయలక్ష్యం 164 | women t-20 bangladesh target 164 runs | Sakshi
Sakshi News home page

మహిళా టీ-20 : బంగ్లా విజయలక్ష్యం 164

Mar 15 2016 5:18 PM | Updated on Sep 3 2017 7:49 PM

మహిళా టీ-20 : బంగ్లా విజయలక్ష్యం 164

మహిళా టీ-20 : బంగ్లా విజయలక్ష్యం 164

ప్రపంచ పురుషుల, మహిళల టీ-20 సందడి మొదలైంది. మహిళల టీ-20 తొలి మ్యాచ్లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది.

బెంగళూరు:  ప్రపంచ పురుషుల, మహిళల టీ-20 క్రికెట్ సందడి ప్రారంభమైంది. మహిళల టీ-20 తొలి మ్యాచ్లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ 164 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగనుంది.

భారత్ ఓపెనర్లు మిథాలీ రాజ్(42 ), వెల్లస్వామి వనిత(38) మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తొలి వికెట్కు 62 పరుగుల భాగస్వామ్యం చేయడంతో తర్వాత వచ్చి న మందాన డకౌట్తో నిరుత్సాహ పరిచిన హర్మాన్ ప్రీత్ కౌర్(40), వేద కృష్ణమూర్తి(36 నాటౌట్) నిలకడగా ఆడి టీమ్కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. బంగ్లా బౌలర్లలో రుమన అహ్మద్, ఫహిమా కౌతన్ రెండేసి వికెట్లు తీయగా నహిదా అక్తర్ ఒక వికెట్ తీశారు.  

Advertisement
 
Advertisement
Advertisement