breaking news
women t-20
-
సూపర్ సెంచరీ: శ్రీలంకపై ఐర్లాండ్ తొలి గెలుపు
ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్టు చారిత్రాత్మక విజయం సాధించింది. తొలిసారి శ్రీలంక జట్టుపై గెలుపు నమోదు చేసింది. ఓపెనర్ గాబీ లూయిస్ అద్భుత శతకంతో ఇది సాధ్యమైంది. కాగా రెండు టీ20, ఐసీసీ చాంపియన్‌షిప్‌లో భాగంగా మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు శ్రీలంక మహిళా జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లింది.17 ఫోర్లు, 2 సిక్సర్లుఇరు జట్ల మధ్య ఆదివారం నాటి (ఆగష్టు 11) తొలి టీ20లో శ్రీలంక ఏడు వికెట్ల తేడాతో గెలవగా.. మంగళవారం రాత్రి నాటి రెండో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను అనూహ్య రీతిలో విజయం వరించింది. డబ్లిన్ వేదికగా జరిగిన ఈ టీ20లో టాస్ గెలిచిన ఆతిథ్య ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ ఆమీ హంటర్ 9 పరుగులకే అవుటైనా.. మరో ఓపెనర్ గాబీ లూయిస్ ఆకాశమే హద్దుగా చెలరేగింది.#Champion https://t.co/RSI0agcCbl— Cricket Ireland (@cricketireland) August 13, 2024 ఏకంగా 17 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 75 బంతుల్లోనే 119 పరుగులతో సత్తా చాటింది. గాబీకి తోడుగా వన్‌డౌన్ బ్యాటర్ ఓర్లా ప్రెండ్రెర్గాస్ట్(38) రాణించింది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సరికి మూడు వికెట్ల నష్టానికి ఐరిష్ జట్టు 173 పరుగులు స్కోరు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంక ఆదిలోనే తమ ఓపెనర్ విష్మి గుణరత్నె(1) వికెట్ కోల్పోయింది.రాణించిన హర్షిత, కవిశా.. కానీ ఓటమి తప్పలేదుఅయితే, మరో ఓపెనింగ్ బ్యాటర్ హర్షిత సమరవిక్రమ 65 పరుగులు చేసి ఇన్నింగ్స్ చక్కదిద్దింది. నాలుగో స్థానంలో వచ్చిన కవిశా దిల్హారీ 51 పరుగులతో అజేయంగా నిలవగా.. మిగతా వాళ్ల నుంచి సహకారం కరువైంది. ఫలితంగా 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 166 పరుగులు మాత్రమే చేయగలిగిన శ్రీలంక ఏడు పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది.ఈ నేపథ్యంలో ఐర్లాండ్ మహిళా జట్టుకు శ్రీలంకపై తొలి అంతర్జాతీయ విజయం దక్కింది. ఐరిష్ బౌలర్లలో ఫ్రెయా సార్గెంట్, ఓర్లా ప్రెండ్రెర్గాస్ట్ రెండేసి వికెట్లు తీయగా.. జానే మాగ్విరే, అవా కానింగ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఇక రెండో టీ20లో విజయంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది ఐర్లాండ్. గాబీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య శుక్రవారం నుంచి వన్డే సిరీస్ మొదలుకానుంది.What. A. Game. https://t.co/PL5dcMepch— Cricket Ireland (@cricketireland) August 13, 2024 చదవండి: The Hundred 2024: కళ్లుచెదిరే క్యాచ్.. చూస్తే వావ్ అనాల్సిందే(వీడియో) -
మహిళా టీ-20 : బంగ్లా విజయలక్ష్యం 164
బెంగళూరు: ప్రపంచ పురుషుల, మహిళల టీ-20 క్రికెట్ సందడి ప్రారంభమైంది. మహిళల టీ-20 తొలి మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ 164 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగనుంది. భారత్ ఓపెనర్లు మిథాలీ రాజ్(42 ), వెల్లస్వామి వనిత(38) మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. తొలి వికెట్‌కు 62 పరుగుల భాగస్వామ్యం చేయడంతో తర్వాత వచ్చి న మందాన డకౌట్‌తో నిరుత్సాహ పరిచిన హర్మాన్ ప్రీత్ కౌర్(40), వేద కృష్ణమూర్తి(36 నాటౌట్) నిలకడగా ఆడి టీమ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. బంగ్లా బౌలర్లలో రుమన అహ్మద్, ఫహిమా కౌతన్ రెండేసి వికెట్లు తీయగా నహిదా అక్తర్ ఒక వికెట్ తీశారు.