హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో భాగంగా యూపీ విజార్డ్స్, ఢిల్లీ వేవ్‌రైడర్స్ జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ డ్రా అయింది.
న్యూఢిల్లీ: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో భాగంగా యూపీ విజార్డ్స్, ఢిల్లీ వేవ్‌రైడర్స్ జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్ డ్రా అయింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు 1–1 స్కోరుతో సమంగా నిలిచాయి. యూపీ జట్టు తరఫున పేయ్‌లెట్ (22వ ని.), ఢిల్లీ జట్టులో రూపిందర్ (22వ ని.) పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలిచారు. సోమవారం జరిగే మ్యాచ్‌లో యూపీ విజార్డ్స్ జట్టుతో పంజాబ్ వారియర్స్ జట్టు తలపడుతుంది.