భారత మహిళలదే సిరీస్ | With the win the second match by 5 wickets | Sakshi
Sakshi News home page

భారత మహిళలదే సిరీస్

Nov 13 2016 11:55 PM | Updated on Sep 4 2017 8:01 PM

బ్యాటింగ్ చేస్తున్న భారత కెప్టెన్ మిథాలీ రాజ్

బ్యాటింగ్ చేస్తున్న భారత కెప్టెన్ మిథాలీ రాజ్

భారత్‌పై గెలిచి ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలని భావించిన వెస్టిండీస్ మహిళలకు మిథాలీ సేన చేతిలో....

రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో గెలుపు 

విజయవాడ స్పోర్‌‌ట్స: భారత్‌పై గెలిచి ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించాలని భావించిన వెస్టిండీస్ మహిళలకు మిథాలీ సేన చేతిలో వరుస పరాజయాలు ఎదురవుతున్నారుు. రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో భారత మహిళల జట్టు విజయం సాధించింది. తద్వారా మరో వన్డే మిగిలుండగానే 2-0తో సిరీస్‌ను కై వసం చేసుకుంది. ఇక్కడి మూలపాడులోని కొత్త స్టేడియంలో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 153 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్ బ్యాట్స్‌వుమెన్‌ను భారత బౌలర్లు సమర్థంగా కట్టడి చేశారు.

దీంతో 58 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోరుు కష్టాల్లో పడింది. మిడిలార్డర్‌లో డియాండ్ర డాటిన్ (101 బంతుల్లో 63; 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించింది. ఈమెకు అగులెరియా (25) అండగా నిలిచింది. జులన్ గోస్వామి, ఏక్తా బిస్త్ చెరో 2 వికెట్లు తీయగా, శిఖా పాండే, రాజేశ్వరిలకు ఒక్కో వికెట్ దక్కింది. తర్వాత 154 పరుగుల లక్ష్యాన్ని భారత్ 38 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోరుు ఛేదించింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (51 బంతుల్లో 45; 6 ఫోర్లు, 1సిక్స్) మళ్లీ రాణించింది. ఓపెనర్ సృ్మతి మందన (62 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్), దీప్తి శర్మ (32) ఆకట్టుకున్నారు. షకీరా సెల్మాన్, హేలీ, అఫీ ఫ్లెచర్, అనీసా తలా ఒక వికెట్ తీశారు. రేపు (మంగళవారం) ఇక్కడే చివరి వన్డే జరుగుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement