విజేత రాజ్‌మోహన్ | Winner Rajmohan | Sakshi
Sakshi News home page

విజేత రాజ్‌మోహన్

Mar 3 2014 11:35 PM | Updated on Sep 2 2017 4:19 AM

విజేత రాజ్‌మోహన్

విజేత రాజ్‌మోహన్

జింఖానా,లాంకో హిల్స్ ఇండియా ఓపెన్ రాకెట్‌బాల్ సింగిల్స్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పురుషుల ఓపెన్‌లో రాజ్‌మోహన్ విజేతగా నిలిచాడు.

 జింఖానా,లాంకో హిల్స్ ఇండియా ఓపెన్ రాకెట్‌బాల్ సింగిల్స్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పురుషుల ఓపెన్‌లో రాజ్‌మోహన్ విజేతగా నిలిచాడు. ఇటీవల జరిగిన ఈ టోర్నీలో రాజ్‌మోహన్ 15-8, 15-7తో శ్రీకరన్‌పై విజయం సాధించాడు.

పురుషుల ‘ఎ’ విభాగంలో చాకో చెరియన్ 15-8, 15-6తో శ్రీనివాస్ అవసరాలపై గెలిచి టైటిల్ దక్కించుకున్నాడు. ‘బి’ విభాగంలో వంశీ వారణాసి 15-8, 15-5తో పుట్ట రవిపై నెగ్గి ప్రథమ స్థానంలో నిలిచాడు. ‘సి’ విభాగంలో అమిత గోండి 15-13, 15-6తో పుట్ట రవిపై గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ‘డి’ విభాగంలో అనిల్ ఖాజా 7-15, 15-11, 11-8తో వినయ్‌పై గెలుపొంది టైటిల్ సాధించాడు.

బాలుర అండర్-18 విభాగంలో సాహిత్ మందాల 15-12, 15-9తో కారుమంచి నీరజ్‌ని ఓడించి విజేతగా నిలిచాడు.
 

Advertisement
 
Advertisement
Advertisement