క్వార్టర్స్‌లో సానియా జోడి | Wimbledon 2016: Sania Mirza-Martina Hingis in quarterfinals; Bopanna-Mergea out | Sakshi
Sakshi News home page

క్వార్టర్స్‌లో సానియా జోడి

Jul 5 2016 1:08 AM | Updated on Sep 4 2017 4:07 AM

క్వార్టర్స్‌లో సానియా జోడి

క్వార్టర్స్‌లో సానియా జోడి

వింబుల్డన్ మహిళల డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి క్వార్టర్స్‌కు చేరింది...

వింబుల్డన్ మహిళల డబుల్స్‌లో భారత స్టార్ సానియా మీర్జా, మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడి క్వార్టర్స్‌కు చేరింది. సోమవారం జరిగిన ప్రి క్వార్టర్స్‌లో సానియా జోడి 6-1, 6-0తో మెక్‌హేల్(అమెరికా)-ఒస్టాపెన్కో (లాత్వియా) జోడిపై అలవోకగా నెగ్గింది. సానియా, హింగిస్‌ల ధాటికి ప్రత్యర్థులు కేవలం 46 నిమిషాల్లో చేతులెత్తేశారు. తొలిసెట్‌లో రెండుసార్లు, రెండో సెట్‌లో మూడుసార్లు ప్రత్యర్థి సర్వీస్‌లను బ్రేక్ చేసిన ‘సాన్‌టీనా’ మ్యాచ్ మొత్తం మీద కేవలం ఒక్క డబుల్ ఫాల్ట్ మాత్రమే చేశారు.

పురుషుల డబుల్స్ మూడో రౌండ్‌లో భారత ఆటగాడు బోపన్న-మార్గియా (రొమేనియా) జోడి 6-2, 3-6, 4-6, 7-6(6), 6-8తో హెన్రి కొంటినెన్(ఫిన్లాండ్)-జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) చేతిలో ఓడిపోయారు.

Advertisement
 
Advertisement
Advertisement