ఐపీఎల్కు దూరంగా ఉంటా: శ్రీనివాసన్ | will keep out of ipl, srinivasan says to supreme court | Sakshi
Sakshi News home page

ఐపీఎల్కు దూరంగా ఉంటా: శ్రీనివాసన్

Dec 10 2014 11:45 AM | Updated on Sep 2 2018 5:20 PM

ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణం విషయంలో తనకు ఉన్నత స్థాయి సంఘం నుంచి క్లీన్ చిట్ వచ్చేవరకు ఐపీఎల్ వ్యవహారాలకు దూరంగా ఉంటానని సుప్రీంకోర్టుకు శ్రీనివాసన్ తెలిపారు.

బీసీసీఐ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తనకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్ సుప్రీంకోర్టును కోరారు. ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణం వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.

ఒకవేళ తాను ఆ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైతే.. ఐపీఎల్ బెట్టింగ్ కుంభకోణం విషయంలో తనకు ఉన్నత స్థాయి సంఘం నుంచి క్లీన్ చిట్ వచ్చేవరకు ఐపీఎల్ వ్యవహారాలకు దూరంగా ఉంటానని కూడా సుప్రీంకోర్టుకు ఆయన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement