విండీస్‌ క్రికెటర్‌ రసెల్‌పై ఏడాది నిషేధం | West Indies cricketer Russell ban on year | Sakshi
Sakshi News home page

విండీస్‌ క్రికెటర్‌ రసెల్‌పై ఏడాది నిషేధం

Feb 1 2017 12:05 AM | Updated on Sep 5 2017 2:34 AM

విండీస్‌ క్రికెటర్‌ రసెల్‌పై ఏడాది నిషేధం

విండీస్‌ క్రికెటర్‌ రసెల్‌పై ఏడాది నిషేధం

డోపింగ్‌ నిబంధనలను అతిక్రమించినందుకు వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌పై ఏడాది పాటు నిషేధం విధించారు.

డోపింగ్‌ నిబంధనలను అతిక్రమించినందుకు వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ ఆండ్రీ రసెల్‌పై ఏడాది పాటు నిషేధం విధించారు. స్వతంత్ర డోపింగ్‌ నిరోధక ట్రిబ్యునల్‌ మంగళవారం ఈ తీర్పు వెలువరించింది. నిషేధం వెంటనే అమల్లోకి వస్తుంది.

2015లో మూడు వేర్వేరు తేదీల్లో తాను ఎక్కడ ఉన్నాడో తెలపాలంటూ ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) ఆదేశించగా, ఆ వివరాలను ఇవ్వడంలో రసెల్‌ విఫలమయ్యాడు. నిబంధనల ప్రకారం స్పందించకపోవడాన్ని డ్రగ్‌ పరీక్షలో విఫలమైనట్లుగానే భావిస్తారు. విండీస్‌ తరఫున రసెల్‌ 51 వన్డేలు, 43 టి20 మ్యాచ్‌లు ఆడాడు.  
 

Advertisement
 
Advertisement
Advertisement