భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్తో పాటు ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్లకు జరిమానా విధించారు.
న్యూఢిల్లీ: భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, శిఖర్ ధవన్తో పాటు ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్లకు జరిమానా విధించారు. భారత్, ఆస్ట్రేలియాల మధ్య అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో వీరు దూషించుకున్నందుకు ఐసీసీ చర్యలు తీసుకుంది.
కోహ్లీ, ధవన్లకు మ్యాచ్ ఫీజులో 30 శాతం చొప్పున, వార్నర్కు 15 శాతం జరిమానా వేసినట్టు ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. మ్యాచ్ నాలుగో రోజు శుక్రవారం వీరు దూషణలకు దిగారు. దీంతో ఐసీసీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. శనివారం ముగిసిన ఈ మ్యాచ్లో ఆసీస్ 48 పరుగులతో భారత్పై విజయం సాధించింది.