2020 ఒలింపిక్స్‌ నుంచి రష్యా ఔట్‌!

WADA Bans Russia From Olympics For Doping - Sakshi

మాస్కో : రష్యాకు భారీ షాక్‌ తగిలింది. డోపింగ్‌ టెస్టుకు సంబంధించి రష్యా తప్పుడు సమాచారం ఇచ్చిందని పేర్కొంటూ రష్యా ఆటగాళ్లపై నిషేధం విధిస్తున్నట్లుగా ప్రపంచ యాంటీ- డోపింగ్ సంస్థ(వాడా) ప్రకటించింది. డోపింగ్‌ టెస్టులో రష్యా జట్టు దొరికిపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సోమవారం పేర్కొంది. ఈ నేపథ్యంలో జపాన్‌ రాజధాని టోక్యోలో 2020లో జరుగనున్న ఒలింపిక్స్‌, 2022లో చైనాలోని బీజింగ్‌లో జరుగనున్న శీతాకాల ఒలింపిక్స్‌ నుంచి రష్యాను తప్పిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు స్విట్జర్లాండ్‌లోని లౌసాన్‌లో జరిగిన సమావేశంలో వాడా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.

ఈ విషయం గురించి వాడా ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ... ‘రష్యన్‌ జట్టుపై నాలుగేళ్ల పాటు నిషేధం విధిస్తున్నాం. వాడా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకుంది’అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో రష్యా అథ్లెట్లు న్యూట్రల్స్‌గా మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు వారు వాడా పరీక్షలన్నింటిలో సఫలం కావాల్సి ఉంటుంది. అదే విధంగా వారికి సంబంధించిన శాంపిల్స్‌ ప్రభావితం కాలేదని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఇక నిషేధంపై అప్పీలు చేసుకోవడానికి 21 రోజులపాటు రష్యాకు వాడా గడువునిచ్చింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top