మళ్లీ సెహ్వాగ్‌ ట్వీటర్‌ వార్‌.. | Virender Sehwag, Piers Morgan indulge in Twitter banter over India's loss to England in WWC 2017 Final | Sakshi
Sakshi News home page

మళ్లీ సెహ్వాగ్‌ ట్వీటర్‌ వార్‌..

Jul 24 2017 9:58 AM | Updated on Sep 5 2017 4:47 PM

మళ్లీ సెహ్వాగ్‌ ట్వీటర్‌ వార్‌..

మళ్లీ సెహ్వాగ్‌ ట్వీటర్‌ వార్‌..

ఇంగ్లండ్‌తో భారత్‌ మహిళల ఓటమిని ఉద్దేశిస్తూ.. సెహ్వాగ్‌ను ఈ విజయం సరిపోతుందా మిత్రమా..

న్యూఢిల్లీ: రియో ఒలంపిక్స్‌లో భారత్‌కు స్వర్ణం అందించిన పీవీ సింధూని ప్రశంసలతో ఆకాశన్నెత్తుకున్న భారత అభిమానులను తప్పుబడుతూ ట్వీట్‌ చేసి బ్రిటీష్‌ జర్నలిస్టు మోర్గాన్‌ గుర్తుకున్నాడా..?  ఆ సదరు జర్నలిస్టు మళ్లీ తన నోటికి పని చెప్పాడు.  అయితే క్రికెట్‌ కనిపెట్టిన మీరు( ఇంగ్లండ్‌ మెన్స్‌ జట్టు) ఇంత వరకు ఒక వరల్డ్‌కప్‌ సాధించకపోవడం సిగ్గు చేటు అని అప్పట్లో మన మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ సెహ్వాగ్ స్ట్రాంగ్‌ సమాధానమిచ్చిన విషయం తెలిసిందే.

అయితే మహిళ ప్రంపంచకప్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ మహిళల ఓటమిని ఉద్దేశిస్తూ.. సెహ్వాగ్‌ను ఈ విజయం సరిపోతుందా మిత్రమా..  అని పుండు మీద కారం చల్లినట్లు ట్వీట్‌ చేశాడు. దీనికి సెహ్వాగ్‌ స్ట్రాంగ్‌ రిప్లే ఇచ్చాడు.. ఈ ఓటమిని కూడ మేం గర్విస్తున్నాము.. దీంతో మా జట్టు మరింత ధృడంగా తయారైందని.. సెహ్వాగ్‌ ట్వీట్‌ చేశాడు. అయితే మోర్గాన్‌ పాత విషయాలను గుర్తు చేస్తూ మన ఛాలెంజ్‌ గుర్తుందా అని మరో ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీటర్‌ వార్‌కు భారత అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement