నీ ప్రేమతో నన్ను పూర్తిగా మార్చావ్‌ : కోహ్లి | Virat Kohli Shares A Adorable Post About Anushka Sharma | Sakshi
Sakshi News home page

నీ ప్రేమతో నన్ను పూర్తిగా మార్చావ్‌ : కోహ్లి

Sep 27 2018 8:56 AM | Updated on Sep 27 2018 11:50 AM

Virat Kohli Shares A Adorable Post About Anushka Sharma - Sakshi

విరాట్‌ కోహ్లి - అనుష్క శర్మ (ఫైల్‌ ఫోటో)

సోషల్‌ మీడియా సాక్షిగా.. భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, తన భార్య అనుష్క శర్మ మీద ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. బుధవారం కోహ్లి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌ ఖేల్‌రత్న’ అవార్డ్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా  కోహ్లి తన ఇన్‌స్టాగ్రామ్‌లో, అనుష్క ఫోటోను షేర్‌ చేస్తూ ‘అడ్డంకులను ఎదుర్కొంటూ.. మంచి పనులు చేసుకుంటూ ముందుకు నడిచేలా నిరంతరం నన్ను ప్రోత్సాహించే వ్యక్తి.. నిజమైన ప్రేమలోని శక్తిని తెలియజేసి.. నన్ను పూర్తిగా మార్చిన వ్యక్తి.. నా బలం.. నా సోల్‌మెట్‌’ అంటూ అనుష్క శర్మ గురించి ట్వీట్‌ చేశారు.

బుధవారం కోహ్లి రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ‘ఖేల్‌ రత్న’ పురస్కారం అందుకున్నారు. ఈ పురస్కారం అందుకున్న మూడో భారత క్రికెటర్‌గా కోహ్లి నిలిచారు. గతంలో సచిన్‌ టెండుల్కర్‌, మహేంద్ర సింగ్‌ ధోని ఈ అత్యున్నత క్రీడా పురస్కారాన్ని అందుకున్నారు. తాజాగా కోహ్లి మూడో వ్యక్తిగా వారి సరసన చేరాడు.

Advertisement
 
Advertisement
Advertisement