టాప్-10లో విరాట్ ఒక్కడే.. | virat kohli flirts with fame | Sakshi
Sakshi News home page

టాప్-10లో విరాట్ ఒక్కడే..

Jun 4 2016 6:21 PM | Updated on Sep 4 2017 1:40 AM

టాప్-10లో విరాట్ ఒక్కడే..

టాప్-10లో విరాట్ ఒక్కడే..

ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో తరచు వార్తల్లో నిలుస్తున్న ఆటగాడు విరాట్ కోహ్లి.

ఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో తరచు వార్తల్లో నిలుస్తున్న ఆటగాడు విరాట్ కోహ్లి. వన్డేల్లో వేగంగా 7000 పరుగులు, వేగంగా 25 సెంచరీలు, అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సగటు, ఐపీఎల్ లో ఒకే సీజన్‌లో నాలుగు శతకాలు, ఒకే సీజన్లో అత్యధిక పరుగులు. ఇలా తనదైన ముద్రతో చెలరేగిపోతున్న విరాట్కు  మరో అరుదైన గౌరవం లభించింది.  తాజాగా ఈఎస్పీఎన్ విడుదల చేసిన 'ఫేమ్-100' ర్యాంకింగ్స్ లో విరాట్ ఎనిమిదో స్థానం దక్కించుకున్నాడు. తద్వారా టాప్-10 లో నిలిచిన ఏకైక క్రికెటర్ గా విరాట్ గుర్తింపు సాధించాడు.


క్రీడాకారుల జీతభత్యాలు,ఎండోర్స్మెంట్స్, సోషల్ మీడియాలో ఫాలోయింగ్, గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఆటగాళ్ల పాపులారిటీ పరిగణలోకి తీసుకుని దాని ఆధారంగా ఆటగాళ్ల ర్యాంకులను ప్రకటిస్తారు. ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి 14వ స్థానం దక్కగా, భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాకు  41 ర్యాంక్లో నిలిచింది.  

టాప్-10 ఆటగాళ్లు

1.క్రిస్టియానో రొనాల్డో(ఫుట్ బాల్)

2.లీ బ్రాన్ జేమ్స్(బాస్కెట్ బాల్)

3.లియోనల్ మెస్సీ(ఫుట్ బాల్)

4.నెయమార్(ఫుట్ బాల్)

5. రోజర్ ఫెదరర్(టెన్నిస్)

6. కెవిన్ దురంత్(బాస్కెట్ బాల్)

 7. టైగర్ వుడ్స్(గోల్ఫ్)

8. విరాట్ కోహ్లి(క్రికెట్)

9. జేమ్స్ రోడ్రిగ్యూస్(ఫుట్ బాల్)

10. రఫెల్ నాదల్(ఫుట్ బాల్)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement