చిం​దేసిన కోహ్లి, చాహల్‌ | Virat Kohli Chahal McCullum Shakes Leg For IPL | Sakshi
Sakshi News home page

చిం​దేసిన కోహ్లి, చాహల్‌

Apr 4 2018 10:21 AM | Updated on Apr 7 2018 5:37 PM

Virat Kohli Chahal McCullum Shakes Leg For IPL - Sakshi

చిందేస్తున్న ఆర్సీబీ ఆటగాళ్లు మెకల్లమ్‌, కొహ్లీ, చాహల్‌

సాక్షి, బెంగళూరు : క్రికెట్‌ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌-11వ సీజన్‌ మరో మూడో రోజుల్లో మొదలు కానుంది. అన్ని జట్లు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టేశాయి. కేవలం ఆటతోనే సరిపెట్టకుండా స్టెప్పులేసి మరీ అభిమానులను ఆకట్టుకోవడానికి రాయల్‌ చాలెంజర్స్‌(ఆర్సీబీ) బెంగుళూరు ఆటగాళ్లు సిద్ధమయ్యారు. ఆర్సీబీ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లితో పాటు ఆటగాళ్లు యజువేంద్ర చాహల్, బ్రెండన్‌ మెకల్లమ్‌ చిందులేశారు. ‘ఐపీఎల్‌ కోసం లెజెండ్స్‌తో వార్మప్‌ మొదలెట్టేశా’ అంటూ కోహ్లి, మెక్‌కల్లమ్‌ను ట్యాగ్‌ చేస్తూ 12 సెకన్ల నిడివి ఉన్న డాన్స్‌ వీడియోను చాహల్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాడు.

ఈ వీడియోలో కోహ్లి తనదైన శైలిలో రెచ్చిపోగా మెక్‌కల్లమ్‌, చాహల్‌లు అతన్ని అనుకరించే ప్రయత్నం చేశారు. ఏప్రిల్‌ 8న ఆర్సీబీ, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(కేకేఆర్‌)తో తలపడనుంది. విరాట్‌ కోహ్లి, క్రిస్‌ గేల్‌ వంటి స్టార్లతో పాటు యువ ఆటగాళ్లతో ఎంతో పటిష్టమైన జట్టుగా పేరున్నప్పటికీ ఆర్సీబీ ఒక్కసారి కూడా ఐపీఎల్‌ ట్రోఫీ అందుకోలేకపోయింది. ఫైనల్‌కు చేరిన ప్రతిసారీ అభిమానులను నిరాశపర్చింది.

క్రిస్‌గేల్‌ను వదులుకున్న ఆర్సీబీ ఈసారి బ్రెండన్‌ మెకల్లమ్‌, దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌ క్వింటన్‌ డీకాక్‌లను జట్టులోకి తీసుకోవడం ద్వారా బ్యాటింగ్‌ లైనప్‌ను పటిష్టపరచుకుంది. ఇక ఆర్సీబీ బౌలర్లు చాహల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఎమ్‌ అశ్విన్‌, పవన్‌ నేగీలు ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను కట్టడిచేసేందుకు తమ బౌలింగ్‌కు పదునుపెడుతున్నారు.    

Advertisement
 
Advertisement
Advertisement